సాధారణంగా కొందరిని మొటిమలు( Pimples ) బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి, రసాయనాలతో కూడిన చర్మ ఉత్పత్తులను వాడటం, చుండ్రు, హార్మోన్ ఛేంజ్ తదితర కారణాల వల్ల ముఖం మొత్తం మొటిమలు ఏర్పడుతుంటాయి.
ఈ మొటిమల కారణంగా తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంటారు.మొటిమల్లేని చర్మాన్ని( Spotless Skin ) పొందడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మొటిమలతో ఇక నో టెన్షన్.
ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే చాలా సులభంగా మొటిమలకు అట్టుకట్ట వేయవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేప పొడిని( Neem Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడి,( Green Tea ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు మూడు టేబుల్ స్పూన్లు రైస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే మీ ముఖ చర్మంపై ఒక్క మొటిమ కూడా ఉండదు.ఈ రెమెడీ మొటిమలకు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా తోడ్పడుతుంది.
మొటిమల తాలూకు మచ్చలను కూడా పోగొడుతుంది.మొటిమలు లేని ముఖ చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీ ని ఫాలో అవ్వండి.
పైగా ఈ రెమెడీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మారుతుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.
కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి స్కిన్ ఏజింగ్ ను సైతం ఆలస్యం చేస్తుంది.