ఫెరూలా అనే వృక్ష జాతికి చెందిన మొక్క పాల నుండి ఇంగువను తయారుచేస్తారు.ఇంగువను వంటల్లో రుచి కోసం వేస్తూ ఉంటారు.
ఇంగువ అనేది వంటలకు రుచిని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది.ఇంగువలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఇప్పుడు వాటి గురించి వివరంగా
తెలుసుకుందాం.
ఆహారంలో ఇంగువను వాడితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వటమే కాకుండా
అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
ఆకలి లేని వారు ఇంగువ వేసిన పదార్ధాలను తింటే ఆకలి పుడుతుంది.అలాగే
కొన్ని రకాల అల్సర్ లను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఇంగువతో తయారుచేసిన పదార్ధాలను తింటూ ఉంటే ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు
వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి.
ఇంగువ రక్తంలో కొవ్వు చేరకుండా చూస్తుంది.దాంతో రక్త సరఫరా బాగుండి
గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయి.
తలనొప్పి,ఒంటి నొప్పులు మొదలైన నొప్పులను తగ్గించే శక్తి ఇంగువకు ఉంది.
ఇంగువను వంటల్లో కాకుండా మాములుగా కూడా తీసుకోవచ్చు.ఆలా తీసుకున్న సరే ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది.అయితే చిటికెడు ఇంగువను ఒక గోరువెచ్చని నీరు లేదా మజ్జిగలో కలుపుకొని త్రాగాలి.