జేడీ లక్ష్మీనారాయణ సీక్రెట్ ఆపరేషన్

సమాజంలో మంచి వాళ్లకి ఎప్పుడు ప్రత్యేక మైన స్థానం ఉంటుది.వాళ్ళు చుట్టూ ఉన్న ప్రజలని ప్రభావితం చేయగలిగిన రోజున ఒక గొప్ప లీడర్ గా ఎదుగుతారు అనడంలో సందేహం లేదు.

 Jd Lakshminarayana Started Ground Work For His New Party-TeluguStop.com

ప్రజలు అటువంటి వారికి నీరాజనాలు పడుతారు.ముఖ్యంగా చదువుకున్న వారు కానీ ఉద్యోగులు కానీ ఇటువంటి వ్యక్తులని తప్పకుండా ఫాలో అవుతారు అయితే ఈ కోవలోకే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత క్రేజీ వాల్ ఉన్నారు అయితే జేపీ రాజకీయంగా ఎదగలేక పోయినా సరే ఆయన వల్ల ప్రబావితం అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు.

అయితే తాజాగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మినారాయ‌ణ తన పదవికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేయడంతో ఇప్పుడు జేడీ పొలిటికల్ ఎంట్రీ పై ఆయనని ఫాలో అయ్యవారి ఎంతో ఆసక్తి ఏర్పడింది అయితే జేడీ మాత్రం తానూ రాజకీయాల్లోకి రావడం లేదు అయితే నేను ఎందుకు రాజీనామా చేశాను నా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి త్వరలో మీడియా ముందుకు వస్తాను అని తెలిపారు.అయితే సమాజ సేవ కోసం మాత్రమే రాజీనామా చేశాను అని చెప్పే జేడీ ఆ సమాజ సేవని రాజకీయల ద్వారా చేయనున్నారు అని టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.

అయితే ముందు నుంచీ జేడీ విద్యార్ధులతో చర్చా గోష్టిలో పాల్గొనడం.

వారి జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పరచుకునేలా తన ప్రసంగాలతో వారిలో చైతన్యం నిపండం చేస్తూ ఉండేవారు.అయితే పదవీ విరమణ తరువాత కూడా జేడీ మరింత ఎక్కువగా కొద్దిరోజులుగా తన కార్యక్రమాలని ఉదృతం చేశారు.

ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.యువతలో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు అయితే ఈ క్రమంలో ఆయన గురించిన కొన్ని కొత్త విషయాలు బయటకి వస్తున్నాయి.

జేడీ పార్టీ ఏర్పాటు ఖాయమని అందుకు తగ్గట్టుగానే కొంద‌రు అధికారులు, సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత‌ల‌తో చర్చలు జరుగుపుతున్నారట ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ ఎలా నడిపితే బాగుంటుంది.ఏ విధంగా ఉంటే.

ప్ర‌జాధ‌ర‌ణ పొందొచ్చు అనే అంశాల‌పై కూడా స‌ర్వే చేయిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా టెక్నాల‌జీ, సోష‌ల్ మీడియా ద్వారా యువ‌త ఆలోచ‌న‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా సాగుతుంద‌ట‌…అయితే రాజకీయాలలో జేడీ రాక తధ్యం అయితే ఎలా జేడీ వ్యూహాలు ఎలా ఉంటాయో అంటూ రాజకీయ పార్టీలు తెగ కంగారు పడుతున్నాయట .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube