త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడిని భక్తులు పెద్ద ఎత్తున పూజిస్తారు.సాధారణంగా మనకు శివుడు విగ్రహరూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తాడు.
ఈ విధంగా లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని భావిస్తారు.ఈ విధమైనటువంటి లింగాలలో పంచలింగాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
మరి పంచలింగాల అని వేటిని అంటారు వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
1.పృథ్విలింగం:
పంచలింగాలలో ఒకటైన పృథ్విలింగం కంచిలో ఉంది.ఈ క్షేత్రంలో వెలిసిన లింగాన్ని స్వయంగా పార్వతీ దేవి చేత ప్రతిష్టించబడినది కావడంవల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని ఏకాంబరేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు.అదే విధంగా ఇక్కడ వెలసిన అమ్మవారు కామాక్షి దేవి అమ్మవారు.
2.ఆకాశలింగం:
ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో ఉన్నది.ఈ ఆలయంలోని వెలసిన స్వామి వారి దర్శనం ఎంతో రహస్యం.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి విగ్రహానికి దర్శనం ఉండదు.ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3.జల లింగం:
పంచలింగాలలో జలలింగం ఒకటి.తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో వెలసిన స్వామి వారి లింగం కింద ఎప్పుడు నీరు ఉండటం వల్ల ఈ ఆలయంలో వెలసిన లింగానికి జలలింగం అనే పేరు వచ్చింది.అదేవిధంగా స్వామి వారిని జంబుకేశ్వరుడుగా పూజిస్తారు.
4.తేజోలింగం:
అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు.అందుకే ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని అరుణాచలేశ్వరుడుగా, ఇక్కడ వెలసిన అమ్మవారిని అరుణాచలేశ్వరిగా భక్తులు పూజిస్తారు.
5.వాయు లింగం:
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వరలో వెలసిన స్వామివారిని వాయు లింగం అంటారు.ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని శ్రీకాళహస్తీశ్వరుడు అని పూజిస్తారు.ఈ విధంగా పంచభూతలింగాలుగా ఎంతో ప్రసిద్ధి చెందాయి.
DEVOTIONAL