బుల్లితెర ప్రముఖ యాంకర్లలో ఒకరైన ప్రదీప్ కు గతంతో పోల్చి చూస్తే టీవీ షోలకు సంబంధించిన ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.బుల్లితెర షోల ఆఫర్లు తగ్గినా ప్రదీప్ కు క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.
మరోవైపు ప్రదీప్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రదీప్ కూడా తాజాగా పెళ్లికి సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్తుతం ప్రదీప్ జీ సూపర్ ఫ్యామిలీ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ షోలో ప్రదీప్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలలో పెళ్లి చేసుకుంటానని అన్నారు.
ప్రదీప్ అలా చెప్పిన వెంటనే పక్కనే ఉన్న ఒక వ్యక్తి నీకోసం అమలాపురం నుంచి లైన్ ఉంది అని కామెంట్ చేయగా ప్రదీప్ వెంటనే మన అమలాపురం నుంచేనా అంటూ రియాక్షన్ ఇచ్చారు.ప్రదీప్ త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రదీప్ ఎప్పుడు పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారో చూడాల్సి ఉంది.
పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన ప్రదీప్ పలు టీవీ షోలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
బుల్లితెరపై సక్సెస్ అయిన అతికొద్ది మంది మేల్ యాంకర్లలో ప్రదీప్ ఒకరు కావడం గమనార్హం.ప్రస్తుతం ప్రదీప్ కు పోటీనిచ్చే మేల్ యాంకర్ అయితే బుల్లితెరపై లేకపోవడం గమనార్హం.
ప్రదీప్ పలు సినిమాలలో హీరోగా నటించగా ఆ ప్రాజెక్ట్ లు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

అయితే ఆయా సినిమాలలో ప్రదీప్ యాక్టింగ్ కు మాత్రం మంచి పేరొచ్చింది.సరైన కథను ఎంచుకుంటే ప్రదీప్ టాప్ రేంజ్ కు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి ప్రదీప్ ఈ దిశగా అడుగులు వేసి కెరీర్ విషయంలో ముందుకెళతారో లేదో చూడాల్సి ఉంది.







