2022 వ సంవత్సరం తన ప్రథమ అర్ద భాగాన్ని పూర్తి చేసుకుంది.ముఖ్యంగా ఈ ఏడాది ఈ ఏడాది కొన్ని సినిమాలు సీక్వెల్ గా వచ్చి విజయం సాధించడం విశేషం.
అలా 2022 లో ప్రథమార్థంలో సీక్వెల్ సినిమాలు రూపొందించబడి విజయాన్ని అందుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగార్రాజు
మొదటగా ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సింది బంగార్రాజు సినిమా గురించి.
ఈ సినిమా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా రూపొందించబడింది.ఈ సినిమా 2016 లో విడుదలై ఘనవిజయం సాధించగా నాగార్జున డబల్ రోల్ లో నటించాడు.
కానీ సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగార్జున తో పాటు అతడి కొడుకు నాగచైతన్య తో కలిసి నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
కే జి ఎఫ్ చాప్టర్ 2
ఇదే దోవలో విజయ సాధించిన మరొక సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2.
పాన్ ఇండియా సినిమా గా విడుదలైన కేజిఎఫ్ మొదటి భాగం ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది మనందరికీ తెలిసిందే.యష్ హీరోగా నటించిన ఈ చిత్రం బాహుబలి రికార్డులను సైతం దాటింది.
ఇక దీనికి సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 ను విడుదల చేయగా ఈ సినిమా సైతం ప్రపంచ రికార్డులను తుడిచేసింది.రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను సైతం కే జి ఎఫ్ చాప్టర్ 2 రికార్డ్స్ విషయంలో బద్దలు కొట్టిందంటే అంటే అది మామూలు విషయం కాదు.
యావత్ భారతదేశం ఇప్పుడు సౌతిండియా వైపు చూసేలా రాజమౌళి, యష్ సినిమాలు తమ ప్రభావాన్ని చూపాయి అనే చెప్పుకోవాలి.
ఎఫ్ 3
ఇక మూడవ సినిమా ఎఫ్ 3.అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమా ఘనవిజయాన్ని సాధించింది.ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్లాన్ చేసి ఎఫ్ 3 ని విడుదల చేయగా అది కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలిచింది అలాగే వెంకటేష్ కెరీర్లోనే మరొక హిట్ ని ఖాతాలో వేసుకునేలా చేసింది.ప్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా రూపంలో మరొక హిట్ దక్కింది
.