టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో కాయదు లోహర్ ఒకరు.తెలుగులో గతంలో అల్లూరి అనే సినిమాలో నటించిన ఈ బ్యూటీ డ్రాగన్ సినిమాతో పాపులర్ అయ్యారు.
డ్రాగన్ మూవీలో గ్లామర్ రోల్ లో మెరిసిన ఈ బ్యూటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచిన నేపథ్యంలో కాయదు లోహార్ కు మూవీ ఆఫర్లు పెరుగుతున్నాయి.
విశ్వక్ సేన్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు శింబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సైతం కాయదు లోహార్ కనిపించనున్నారని తెలుస్తోంది.కాయదు లోహార్ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.
డ్రాగన్ బ్యూటీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత బిజీ కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అస్సాంకు చెందిన ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం పక్కా అని చెప్పవచ్చు.
క్యూట్ లుక్స్ ఉండటం ఈ బ్యూటీకి మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు.కాయదు లోహార్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
సరైన ప్రణాళికలతో ముందడుగులు వేస్తే ఈ బ్యూటీకి కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు.

కాయదు లోహార్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ క్రేజ్ అంచనాలకు మించి పెరుగుతోంది.కాయదు లోహార్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
కాయదు లోహార్ ను అభిమానించే ఫ్యన్స్ సంఖ్య పెరుగుతోంది.కాయదు లోహార్ చాలా సంవత్సరాల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు ప్రేక్షకులకు ఆమె క్రష్ గా మారిపోయారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.