మన భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగువారు పెరుగు( Curd ) లేకుండా భోజనం చేయరు.ఎన్ని రకాల కూరలు ఉన్నా లాస్ట్ లో పెరుగు ఉండాల్సిందే.
అందులోనూ ప్రస్తుత సమ్మర్( Summer ) సీజన్ లో ఒంటికి చలువ చేస్తుందన్న కారణంతో పెరుగును మరింత ఎక్కువగా తీసుకుంటారు.మీ లిస్ట్‌లో మీరు ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పకుండా తెలుసుకోండి.సమ్మర్‌లో పెరుగు తినడం నిజంగానే చాలా మంచిది.వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరిచే, జీర్ణవ్యవస్థను బలపరిచే ఆహారాల్లో పెరుగు అగ్రస్థానంలో ఉంటుంది.
పెరుగు తినడం వల్ల శరీరం లోపల నుండి చల్లబడుతుంది.పెరుగులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల సమ్మర్ లో పెరుగును రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల డీహైడ్రేషన్( Dehydration ) బారిన పడే రిస్క్ తగ్గుతుంది.అలాగే పెరుగు లో ఉండే ప్రొబయోటిక్స్ జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతాయి.
పెరుగు లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన శరీరాన్ని హానికర బ్యాక్టీరియాల నుంచి కాపాడతాయి.వేసవిలో పెరుగు తక్షణ శక్తిని అందిస్తుంది.
నీరసాన్ని దూరం చేస్తుంది.

అయితే ఆరోగ్యానికి మంచిదని పెరుగును అతిగా తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.ముఖ్యంగా ఓవర్ గా పెరుగును తీసుకోవడం వల్ల కొందరిలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు రావచ్చు.ఒక్కోసారి అతిగా పెరుగు తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
పెరుగు ఎక్కువ తినడం వల్ల వెయిట్ గెయిన్ కు దారి తీస్తుంది.మొటిమలు మరియు ఇతర చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

కాబట్టి పెరుగు సరైన మోతాదులో తినడం చాలా ముఖ్యం.సాధారణంగా పెద్దవాళ్లు రోజుకు ఒక కప్పు నుంచి ఒకటిన్నర కప్పు (ఒక కప్పు అంటే సుమారు 200 మిల్లీ లీటర్లు) పెరుగును తీసుకోవచ్చు.ఐదేళ్ల పైన పిల్లలకు అర కప్పు నుంచి ఒక ఒక కప్పు పెరుగు పెట్టవచ్చు.వృద్ధులైతే తేలికగా జీర్ణమయ్యేలా ఒక కప్పు లేదా అంతకన్నా తక్కువ తీసుకున్నా సరిపోతుంది.
వ్యాయామం చేసే వారు లేదా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే వారు రోజుకు రెండు కప్పులు పెరుగును తీసుకోవచ్చు.పెరుగును నేరుగా తినొచ్చు.జీలకర్ర పొడి లేదా మిరియాల పొడి మిక్స్ చేసి తింటే ఇంకా ఆరోగ్యకరం.ఇక పెరుగు రాత్రివేళ కాకుండా మధ్యాహ్నం సమయంలో తీసుకోవాలి.