గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికెల్స్( Alekhya Chitti Pickles ) వివాదం పెద్దేత్తున్న చర్చనీయాంశంగా మారింది.పచ్చళ్ల రేటు ఎక్కువగా ఉందని అడిగిన కస్టమర్లపై అలేఖ్య చూపించిన ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది.
నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా., నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోల్లో “కస్టమర్లే మా దేవుళ్లు” అంటూ మాట్లాడే అలేఖ్య.వాస్తవ జీవితంలో మాత్రం ఆ దేవుళ్లనే బూతులతో దూషించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఆమె డబుల్ స్టాండర్డ్స్ గురించి పెద్దెత్తున చర్చ జరుగుతుంది.అంతేకాకుండా మీమ్స్, ట్రోల్స్‌తో నెట్టింట నిండిపోయింది.
వీడియోలలో కనిపించే అలేఖ్య వేరు.నిజ జీవితంలో ఉన్నది వేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వివాదం పెద్దదవడంతో అలేఖ్య కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.ఆమె అక్క, చెల్లెలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.అలేఖ్యను బూతులతో రెచ్చిపోయేలా చేసిన పక్కదారి అంశాలు ఉన్నాయని వారు తెలిపారు.అయితే, ఈ వివరణలు నెటిజన్లను పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయాయి.అలేఖ్యకు సంబంధించిన పాత వీడియోలు, వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.చివరికి అలేఖ్య చిట్టి క్షమించండి.
తప్పు చేశాను. అంటూ ఓ వీడియోను విడుదల చేసింది .దింతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో, అలేఖ్య కుటుంబం( Alekhya Family ) తాత్కాలికంగా తమ బిజినెస్‌కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.వెబ్‌సైట్, యాప్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ను బ్లాక్ చేసి ఉంచారు.వ్యాపారంపై( Business ) పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని, ఈ కాంట్రవర్సీ కాస్త చల్లారే వరకు బిజినెస్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే తీవ్ర స్థాయిలో నష్టాన్ని ఎదుర్కొంటున్న అలేఖ్య పికెల్స్ బిజినెస్ మరోసారి పునరుద్ధరించాలంటే, నమ్మకాన్ని తిరిగి పొందాల్సిందే.నెటిజన్ల విశ్వాసం తిరిగి సంపాదించడం అలేఖ్యకు పెద్ద సవాలుగా మారింది.