ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, చర్మ సమస్యలే కాదు వివిధ రకాల జుట్టు సమస్యలు కూడా తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, డ్యాండ్రఫ్, వైట్ హెయిర్ ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి.
వాటిని నివారించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోం రెమెడీని ట్రై చేస్తే ఆయా జుట్టు సంబంధిత సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.
దానిలో ఉండే జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ నుండి పల్చటి వస్త్రం సాయంతో కొబ్బరి పాలను వేరు చేయాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అలోవెర జెల్, నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.పొడి జుట్టు నుంచి విముక్తి లభిస్తుంది.చుండ్రు సమస్య మాయం అవుతుంది.మరియు వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉంటుంది.
ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నా.అది క్రమంగా బ్లాక్ అవుతుంది.