ఎండాకాలంలో కుండలోని పెరుగు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

వేసవి కాలంలో సాధారణంగా చెప్పాలంటే అందరి ఇళ్లలో కూడా పెరుగు కచ్చితంగా ఉంటుంది.వేసవి కాలంలో పెరుగు అన్నం తినాలని చాలామంది అనుకుంటారు.

 Amazing Health Benefits Of Eating Curd In Clay Pot,clay Pot,curd,pot Curd,earthe-TeluguStop.com

అలాగే పెరుగన్నం తిననిది భోజనం పూర్తి కాదని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు.అయితే ప్రస్తుత రోజుల్లో అధిక శాతం మంది ప్లాస్టిక్, స్టీల్ గిన్నెలలో, గ్లాసులలో పెరుగు తోడు వేసుకుంటున్నారు.

కానీ పూర్వం రోజులలో మాత్రం మట్టి కుండ( Pot )లో తోడు పెట్టేవారు.అయితే ఆ విధంగా తయారు చేసిన పెరుగు ఎంతో రుచికరంగా ఉంటుంది.

మట్టికుండలో తోడుపెట్టిన పెరుగు( Pot Curd ) రుచిగానే కాకుండా దానితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మట్టి కుండలో తయారు చేసిన పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి.అయితే ఇవి జీర్ణక్రియను అలాగే ఇమ్యూనిటీ పవర్ ను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇక మట్టిలో ఉండే పోరస్ స్వభావం కుండ లోపల ఉండే గాలిని ప్రసరించడానికి అనుకూలంగా ఉంటుంది.

అంతేకాకుండా పెరుగులో ఉండే అదనపు నీరును కుండ పీల్చుకుంటుంది.అలాగే పెరుగు మరింత గట్టిగా అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.పెరుగులో క్యాల్షియం, మెగ్నీషియం, ఖనిజ లవనాలు అధికంగా ఉంటాయి.

పెరుగులో ఖనిజలవనాలతో పాటు ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.అయితే పెరుగుకు మట్టి లాంటి ఫ్లేవర్ కూడా ఆడ్ అవుతుంది.

అందుకే గిన్నెలో తోడుపెట్టిన పరుగులు ఇలాంటి ఫ్లేవర్ అసలు యాడ్ కాదు.కాబట్టి మట్టి కుండలో తయారుచేసిన పెరుగులో ఉండే ఆల్కలీన్ పెరుగులో ఆమ్లత్వాలను బ్యాలెన్స్ చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube