protein powders: ఈ ప్రోటీన్ పౌడర్స్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యం పై ఇన్ని చెడు ప్రభావాలు ఉన్నాయా..

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఉద్యోగాలు చేస్తూ వారి ఆరోగ్యాలపై ఎక్కువగా శ్రద్ధ చూపలేకపోతున్నారు.దాని కారణంగా ప్రతిరోజు ఉదయం జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం గాని, మైదానానికి వెళ్లి వాకింగ్ చేయడం కానీ చేసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది.

 Are There So Many Bad Effects On Health Due To The Use Of These Protein Powders-TeluguStop.com

ప్రస్తుత కాలంలో కొంతమంది యువత మాత్రమే జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేస్తున్నారు.వీరిలో ఎక్కువమంది ఈ జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడానికి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ప్రోటీన్ పౌడర్ ద్రవ పదార్థంలో గ్లోబల్ఆర్ ప్రోటీన్ ఉంటుంది.ఈ పదార్థం జున్ను ఉత్పత్తుల తీసుకుంటారు.

ఈ గ్లోబలర్లు శరీరానికి మేలు చేసే దానికన్నా ఎక్కువగా హానే చేస్తాయి.ఈ ప్రోటీన్ పౌడర్లు ఉపయోగించడం వల్ల శరీరంపై ఎలాంటి హానికరమైన ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హార్మోన్లు బయో ఆక్టివ్లను కలిగి ఉండే ప్రోటీన్ లాంటి పౌడర్ల ఉత్పత్తిని ఎక్కువగా పెరిగేలా చేస్తుంది.ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మొటిమల సమస్య పెరిగే అవకాశం ఉంది.

Telugu Eggs, Tips, Meat, Milk, Protein Powders-Telugu Health

అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోని పోషకాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.గుడ్లు, పాలు, మాంసం వంటి సహజ ప్రోటీన్లను తీసుకోవడం వల్ల ఇది జరిగే అవకాశాలను తగ్గించుకోవచ్చు.ప్రోటీన్ పౌడర్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అంత మంచిది కాదు.ఇంకా చెప్పాలంటే ప్రోటీన్ పౌడర్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఇంకా చెప్పాలంటే బాడీ బిల్డర్లు మంచి కంపెనీ నుంచి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలని చెబుతున్నారు.కొన్ని కంపెనీల ప్రోటీన్ పౌడర్లు విషపూరిత లోహాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కూడా చెబుతున్నారు.

శరీరానికి ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా హాని చేస్తాయి.వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా తలనొప్పి, అలసట, మలబద్ధకం, కండరాల నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

కొన్నిసార్లు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube