భారతీయ హిందూ ధర్మంలో అనేక సంప్రదాయాలు, విశ్వాసాలను పాటించడం పరిపాటి.ప్రాణి భూమ్మీద పడినప్పటి నుంచి మరణించి మరుభూమికి చేరుకునేవరకూ చేయవలసిన 16 కర్మలను ( 16 Karmas ) ఇక్కడ తప్పనిసరిగా అనుసరిస్తారు.అవేమిటంటే?
1.గర్భాదానం:
గర్భాదానం( Pregnancy ) అనగా ఇద్దరు స్త్రీ పురుషుల (భార్యభర్తలు) కలయిక.ఇక్కడ ఓ కొత్తప్రాణికి జీవం పోయడాన్ని గర్భాదానం అంటారు.వివాహిత స్త్రీ స్వచ్ఛమైన ఆలోచనలతో గర్భం దాల్చినప్పుడు ఆమె ఆరోగ్యకరమైన, తెలివైన బిడ్డకు జన్మనిస్తుంది.ఈ ఆచారం కుటుంబ వృద్ధిని సూచిస్తుంది.
2.పుంసవనం:
అప్పట్లో ఓ వంశానికి వారసుడు కావాలని పుట్టేవరకూ బిడ్డల్ని కంటూనే ఉండేవారు.అందుకే గర్భందాల్చిన తర్వాత పుంసవనం చేయించేవారు.
ఈ క్రతువు చేస్తే మగపిల్లాడు పుడతాడని విశ్వశించేవారు.అయితే ఇది జరిపించిన తర్వాత కూడా ఆడపిల్ల పుట్టిన సందర్భాలు లేకపోలేదు.

3.సీమంతం:
ఈ కార్యక్రమం గర్భం దాల్చిన తరువాత చేవలసినది.తద్వారా కడుపులో ఉన్న బిడ్డకు మంచి గుణాలు, మంచి స్వభావం ఏర్పడి ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని నమ్ముతారు.
4.జాతకకర్మ:
బిడ్డ పుట్టిన తర్వాత జరిపే కార్యమిది.గర్భంలో ఏర్పడిన దోషాలను తొలగించే ఈ వ్రతంలో నవజాత శిశువుకు( New Born Baby ) ఉంగరపు వేలు నుంచి లేదా.
బంగారు స్పూన్ నుంచి తేనె, నెయ్యి తీసి నాలుకకి రాస్తారు.నెయ్యి ఆయుష్షును పొడిగించగలదని పిత్త వాతాలను నాశనం చేస్తుందని నమ్ముతారు.అలాగే తేనెను కఫ నిరోధకంగా పనిచేస్తుందని వినియోగిస్తారు.
5.నామకరణ వేడుక:
నామకరణ మహోత్సవం( Naming Ceremony ) అనేది మనం కాస్త హాట్టహాసంగా జరుపుకుంటాం.బిడ్డ పుట్టిన సమయం రోజుమీద ఆధారపడి నామకరణం జరుపుతారు.

6.ఇల్లు దాటించడం:
అమ్మ కడుపులోంచి భూమ్మీద పడినతర్వాత మొదటి సారిగా ఇల్లు దాటేందుకు మంచి రోజు చూసి తీసుకెళతారు.అదికూడా మొదటిసారిగా ఆలయానికి తీసుకెళ్లడం హిందూ సంప్రదాయం.
7.అన్నప్రాశన:
పెరిగే బిడ్డకు భౌతికావసరాలు తీర్చడానికి ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టే ప్రక్రియ.ఈ ఆచారం ద్వారా నవజాత శిశువుకు మొదటిసారి ఆహారం నోటికి అందిస్తారు.
8.కేశ ఖండన:
దీనినే పుట్టు వెంట్రుకలు తీయించడం అంటారు.ఈ సంస్కారం ముఖ్య ఉద్దేశం బిడ్డకు బలం, అందం మెరుపు అందించడమే.
9.చెవులు కుట్టించడం:
దీనిని ‘కర్ణవేధ’ అంటారు.బిడ్డకి ఐదేళ్ళ లోపు చేయవలసిన కార్యం ఇది.కర్ణాభరణాలు ధరించడం అందంకోసమే కాక, ఆరోగ్య రీత్యా కూడా చాలా అవసరం.

10.అక్షరాభ్యాసం ఉపనయనం:
బిడ్డ కొంత మానసిక, శారీరక పరిపక్వత పొందినతరువాత కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధపడే సమయంలో చేసే సంస్కారాన్ని ‘అక్షరాభ్యాసం’ అంటారు.ఈ క్రతువును ఏడో సంవత్సరంలో చేయాలని అప్పటి రుషులు చెప్పేవారు.
11.కేశాంత
అబ్బాయికి పదాహారేళ్ళ వయసు వచ్చాక మొదటిసారి గడ్డం గీసుకోడానికి సంబంధించిన సంస్కారాన్ని ‘కేశాంత’ అంటారు.
12.సమావర్తన:
అప్పట్లో విద్యాభ్యాసం ముగించుకుని గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నిర్వహించే సంస్కారాన్ని ‘సమావర్తన’ అంటారు.దీనికే ‘స్నాతకము’ అని కూడా అంటారు.

13.సమకాలీన సంస్కృతి:
విద్యాభ్యాసం విజయవంతంగా ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన యువకుని ముందు 2 మార్గాలుంటాయి.ఉద్యోగం చేస్తూ ధనం సంపాదించి పెళ్లి చేసుకుని గృహస్థ జీవితం గడపడం ఒకటైతే గడించిన జ్ఞానంతో భౌతిక, మానసిక సంబంధాలకు దూరంగా జపతపాలతో ఆధ్యాత్మిక జీవితం గడపడం రెండోది.
14.వివాహ వేడుక:
వివాహం అనేది మానవజీవితంలోని ముఖ్య ఘట్టం.అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఆఖరిక్షణం వరకూ భార్యాభర్తలు కలసి బతకాలన్నది శాస్త్రవచనం.
15.వివాహ అగ్ని ఆచారాలు:
వివాహం తర్వాత ఆ ఇల్లాలు ఇంటికి చేరిన తర్వాత ఇంట్లో మొదటి సారిగా దీపం వెలిగించే సంస్కారం.ఆ రోజు నుంచి ఆ ఇంటి వెలుగుకి కారణం అవుతానని చెప్పడమే దీనివెనుక ఆంతర్యం.
16.అంత్యక్రియలు:
మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అంత్యేష్ఠి.చనిపోయిన వ్యక్తి కుమారులు తమవారి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని నిర్వహించే కార్యక్రమాన్ని అంత్యక్రియలు అంటారు.వేద మంత్రాల మధ్య కొడుకుతో తలకు నిప్పు పెట్టిస్తారు.13 రోజుల కర్మకాండ అయ్యాక అన్న సంతర్పణ చేయడంతో ఆ సంస్కారం పూర్తవుతుంది.
BREAKING/FEATURED NEWS SLIDE