ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతిలో మనకు సహజ సిద్ధంగా లభించే ప్రతి మొక్క కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.కానీ ఆ మొక్కలను ఎలా ఉపయోగించాలో మనలో చాలా మందికి తెలియదు.
ప్రస్తుత సమాజంలో అన్ని కలుషితం అయిపోతున్నాయి.అందుకే చిన్న పిల్లలు తెలియని వయసులోనే ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నారు.
అనారోగ్య సమస్యలను పూర్తిగా చెక్ పెట్టగలిగే మొక్కలు ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి.
అటువంటి మొక్కలలో కొండపిండి ఆకు మొక్క ఒకటి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఈ మొక్క మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.నయం కానీ వ్యాధులకు కూడా ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది.
కొండ పిండి ఆకు మొక్క ఇది నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది.కొంత మంది దీన్ని పిండి తోండా అని కూడా పిలుస్తారు.
తమిళనాడులో( Tamilnadu ) సంక్రాంతి పండుగ రోజు ఈ మొక్కతో ఇంటిని అలంకరిస్తారు.
ప్రస్తుత కాలంలో కూడా చాలా సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.ఈ మొక్క కండం మొత్తం గుంపులుగా కనిపించే తెల్లని పూలతో ఉంటుంది.ఈ మొక్క ఎక్కడ ఉన్నా సులభంగా గుర్తుపట్టవచ్చు.
అలాగే ఈ మొక్క ఆకులు గుండ్రంగా కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి.దీని పువ్వులు చిన్నగా తెల్లటి రంగులో ఉంటాయి.
ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి.
దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.ఈ మొక్క ఆకులు కిడ్నీలలో రాళ్లను ( Kidney Stones )సైతం కరిగించగలిగే శక్తిని కలిగి ఉంటాయి.