సమాజంలో రోజురోజుకు కష్టపడి సంపాదించే వారి కన్నా.అడ్డదారులలో సంపాదించే వారే సంఖ్య అధికం అవుతోంది.
అయితే ముఖ్యంగా దోపిడీ దొంగల ముఠాలకు తాళం వేసి ఉండే ఇల్లు కనిపిస్తే చాలు.క్షణాల్లో దోపిడీ చేసి అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా పారిపోతున్నారు.
ఇలాంటి కోవలోనే ఓ వ్యక్తి తాను వాచ్మెన్ గా( Watchman ) పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశాడు.ఏకంగా రూ.5 కోట్లను దొంగతనం చేశాడు.ఈ ఘటన సికింద్రాబాద్లోని రామ్ గోపాల్ పేట్ లో చోటు చేసుకుంది.
పోలీసులు కేవలం 24 గంటల లోపే దొంగతనం కేసును చేధించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సికింద్రాబాద్ లోని( Secunderabad ) రామ్ గోపాల్ పేట్ పరిధిలో ఉండే సింది కాలనీలో రాహుల్ గోయల్( Rahul Goyal ) అనే ఐరన్ వ్యాపారి తన ముగ్గురు సోదరులతో కలిసి నివాసం ఉంటున్నాడు.బోనాల పండుగ జరుపుకోవడం కోసం రాహుల్ గోయల్ ఈ నెల 9న కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్ కి వెళ్ళాడు.
ఈ రాహుల్ గోయల్ ఇంటికి నేపాల్ దేశస్తుడైన కమల్( Kamal ) అనే వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు.ఇదే దొంగతనం చేయడానికి మంచి సమయం అని భావించిన కమల్ తన దేశానికి చెందిన కొంతమంది వ్యక్తులను పిలిపించుకొని వారితో కలిసి ఇంట్లోకి చొరబడ్డాడు.ఇంట్లో ఉండే రూ.49 లక్షల నగదు, 4 కిలోల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలను తీసుకుని ఉడాయించాడు.

బోనాల పండుగ జరుపుకొని రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చి చూస్తే దొంగతనం జరిగిన విషయం బయటపడింది.వెంటనే రాహుల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.పోలీసులు చుట్టుపక్కల ఉండే సీసీ ఇవి ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి, నిందితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లి రైలులో ముంబై వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు.ఈ నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు ఐదు బృందాలను రంగంలోకి దింపారు.
అయితే నేపాల్ వెళ్లడం కోసం ముంబై బస్ స్టాప్ లో కమల్ తో పాటు అతని భార్య, సోదరుడు, ఇద్దరు పిల్లలు ఓ బృందానికి కనిపించారు.వారందరినీ పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా కమల్ పారిపోయాడు.మిగతా వాళ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.5 కోట్ల సొత్తు రికవరీ చేశారు.పరారీలో ఉన్న కమల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.కేవలం దొంగతనం జరిగిన 24 గంటలలోనే పోలీసులు కేసును చేధించడంతో పలువురు ప్రశంసించారు.







