నలబై ఏళ్లు దాటాయంటే చాలు చర్మంలో ఎన్నెన్నో మర్పులు వచ్చేస్తుంటాయి.చర్మంపై ముడతలు, చారలు, ముదురు రంగు మచ్చలు వంటివి ఏర్పడుతుంటాయి.
అలాగే ముఖంలో కల కూడా తప్పుతుంటుంది.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇకపై బాధపడకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ లోషన్‌ను వాడితే నలబైలోనూ యంగ్‌గా మెరిసిపోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లోషన్ ఎంటో.ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం గింజలు వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన రైస్‌ను వాటర్‌తో సహా బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం నుంచి స్ట్రైనర్ సాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కాచి చల్లార్చిన పాలు నాలుగు టేబుల్ స్పూన్లు, మొదట తయారు చేసి పెట్టుకున్న రైస్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, హాఫ్ టేబుల్ కోకనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని విస్కర్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ న్యాచురల్ పసుపు వేసి.మళ్లీ విస్కర్‌తో ఐదారు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే లోషన్ సిద్ధమైనట్టే.
ఈ లోషన్‌ను ఒక బాటిల్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు.ప్రతి రోజు నిద్రించే ముందు ముఖానికి, మెడకు ఈ న్యాచురల్ లోషన్‌ను రాసుకుని పడుకోవాలి.
తద్వారా చర్మం యవ్వంగా, కాంతివంతంగా మారుతుంది.స్కిన్‌పై ఏమైనా మచ్చలు, ముడతలు ఉంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి.
మరియు స్కిన్ టోన్ కూడా పెరుగుతుంది.
