ఇటీవల కాలంలో రక్తహీనతతో( Anemia ) బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.ముఖ్యంగా ఆడవారు, చిన్న పిల్లలు రక్తహీనత బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రక్తహీనత వల్ల వచ్చే సమస్యల్లో నీరసం( Fatigue ) ముందు వరుసలో ఉంటుంది.అడుగు తీసి అడుగు వెయ్యడానికి కూడా ఒంట్లో ఓపిక ఉండదు.
నిలబడితే చాలు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటుంది.అలసట, బలహీనత, చర్మం పాలిపోవడం, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, చిరాకు, ఏకాగ్రత లోపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
ఇవన్నీ కూడా రక్తహీనత యొక్క లక్షణాలే.రక్తహీనత దూరం కావలన్నా, నీరసం నుంచి బయటపడాలన్న ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
అయితే ఇప్పుడు చొప్పబోయే జ్యూస్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

జ్యూస్ తయారీ కోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బీట్ రూట్( Beetroot ) ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు దానిమ్మ గింజలు,( Pomegranate ) వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆపై స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించడమే.
ఈ బీట్ రూట్ దానిమ్మ జ్యూస్( Beetroot Pomegranate Juice ) ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.బీట్‌రూట్ మరియు దానిమ్మ రెండింటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, నిత్యం బీట్‌రూట్ దానిమ్మ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.
రక్తహీనత పరార్ అవుతుంది.నీరసం, అలసట నుంచి విముక్తి పొందుతారు.

అలాగే బీట్‌రూట్ దానిమ్మ జ్యూస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు హృదయాన్ని రక్షించి, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయి.బీట్‌రూట్ దానిమ్మ జ్యూస్ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.మానసిక ఉల్లాసాన్ని చేకూరుస్తుంది.అంతేకాకుండా ఈ జ్యూస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, సహజమైన మెరుపును జోడిస్తాయి.