ఉదయానికి నీరసంగా బద్దకంగా ఉంటుందా.. అయితే ఈ టీ తో వాటికి బై బై చెప్పండి!

సాధారణంగా కొందరికి ఉదయం నిద్ర లేచే సమయానికి చాలా నీరసంగా మరియు బద్ధకం గా ఉంటుంది.అందులోనూ ప్రస్తుతం చలికాలంలో ఈ సమస్యలు మరింత అధికంగా వేధిస్తూ ఉంటాయి.

 If You Drink This Tea, You Will Get Relief From Fatigue And Laziness! Fatigue, L-TeluguStop.com

వాటి కారణంగా ఉదయం నిద్ర లేవడానికి ఆలస్యం చేస్తుంటారు.ఏ పనిలోనూ చురుగ్గా పాల్గొనలేక పోతుంటారు.

వ్యాయామాలను సైతం నిర్లక్ష్యం చేస్తుంటారు.ఫలితంగా బరువు పెరగడమే కాదు ఎన్నో సమస్యలు చుట్టుకుంటాయి.

అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే టీ ని మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

ఈ టీ ని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే నీరసం, బద్ధకం సమస్యలకు సులభంగా బై బై చెప్పచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Fatigue, Tips, Laziness, Spicy Lemon Tea-Telugu Health Tips

ఆ తర్వాత టీ డికాక్షన్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ డికాక్ష‌న్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ తేనె వేసి బాగా మిక్స్ చేస్తే మన స్పైసీ లెమన్ టీ సిద్ధమవుతోంది.ఈ టీ ని రోజు మార్నింగ్ తీసుకుంటే నీరసం, బద్ధకం వంటివి క్షణాల్లో పరార్ అవుతాయి.

బాడీ సూపర్ యాక్టివ్ గా మరియు రిప్రెషింగ్‌గా మారుతుంది.మెదడు సైతం ఎంతో ఉత్సాహంగా చురుగ్గా పనిచేస్తుంది.

Telugu Fatigue, Tips, Laziness, Spicy Lemon Tea-Telugu Health Tips

అలాగే ఈ స్పైసీ లెమన్ టీ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ క్లీన్ గా మారుతుంది.అంతేకాదు ఈ స్పైసీ లెమన్ టీను తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు వెయిట్ లాస్ కు సైతం ఈ స్పైసీ లెమన్ టీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube