ఆ ఒక్క తప్పు వల్లే వీరసింహారెడ్డిపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయా?

గడిచిన పన్నెండు సంవత్సరాలలో బాలయ్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు ఏవనే ప్రశ్నకు సింహా, లెజెండ్, అఖండ సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి.ఈ మూడు సినిమాలకు బోయపాటి శ్రీను డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

 Reasons Behind Veerasimhareddy Negative Talk Details Here Goes Viral , Negative-TeluguStop.com

అయితే ఈ మూడు సినిమాలలో లెజెండ్ మినహా మిగతా రెండు సినిమాలు నెగిటివ్ టాక్ తో మొదలై ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయి.

అయితే వీరసింహారెడ్డి సినిమా బాలయ్య అభిమానులకు నచ్చినా నెగిటివ్ టాక్ వినిపిస్తుండటం బాలయ్య అభిమానులను ఒకింత హర్ట్ చేస్తోంది.

అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు బాలయ్య గత సినిమాలను పోలి ఉండటం వల్లే ఈ తరహా కామెంట్లు వినిపిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే వీరసింహారెడ్డి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు సాధిస్తుందని బాలయ్య అభిమానులు నమ్ముతున్నారు.

సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని హైలెట్ గా నిలిచిన పాత్ర విషయంలో ఇచ్చిన ట్విస్ట్ వల్ల సెకండాఫ్ కు ఒకింత నష్టం జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అమెరికాలో ప్రీ రిలీజ్ సేల్స్ తోనే వీరసింహారెడ్డి అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఫస్ట్ వీకెండ్ లోనే ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.

అఖండ సినిమా నుంచి బాలయ్య ఓవర్సీస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.సీనియర్ స్టార్ హీరోలను సైతం డీల్ చేయగలనని గోపీచంద్ మలినేని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు.బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ సందడి ఎన్నిరోజులు ఉంటుందో చూడాల్సి ఉంది.

సినిమాలో అందరు నటీనటులు అద్భుతంగా చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య నటన న భూతో న భవిష్యత్ అనే విధంగా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube