వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసిన పచ్చి మామిడికాయ కన్పిస్తూ ఉంటుంది.పచ్చి మామిడికాయ తినటం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
అందుకే ఈ సీజన్ లో చాలా మంది మామిడికాయలు తింటూ ఉంటారు.అయితే చాలా మంది పండిన మామిడికాయను తింటూ ఉంటారు.
ఆలా కాకుండా పచ్చి మామిడికాయను తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
వేసవికాలంలో తరచుగా శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతూ ఉంటుంది.పచ్చి మామిడికాయ జ్యుస్ త్రాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా చూడటమే కాకుండా శరీరంలో ఉండే ముఖ్యమైన మినరల్స్ బయటకు పోకుండా కాపాడుతుంది.
పచ్చి మామిడికాయ తినటం లేదా జ్యుస్ త్రాగటం వలన వేసవిలో సహజంగా వచ్చే మార్నింగ్ సిక్‌నెస్, మలబద్దకం, డయేరియా, అజీర్ణం, గ్యాస్ సమస్యల వంటి అనేక జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
పచ్చి మామిడికాయలో నియాసిన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకాలను తొలగిస్తుంది.
దాంతో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పచ్చిమామిడికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య తగ్గుతుంది.
చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి.
పచ్చిమామిడి కాయలను మధ్యాహ్నం భోజనం చేశాక తింటే నిద్రమత్తు వదిలిపోతుంది.
యాక్టివ్‌గా ఉంటారు.చురుగ్గా పనిచేస్తారు.
శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది.