తాగిన మైఖం లో సావిత్రి చేసిన తప్పు.. ఆమెను అబద్దాల కోరు చేసిందా ?

సావిత్రి.ఎంతోమంది నటీమణులకు ఆమె ఒక ఆదర్శం.

 Sarojini Devi Cheated Savitri , Savitri, Sarojini Devi, Tollywood, Heroine, Rava-TeluguStop.com

సావిత్రిని చూసి సినిమాల్లోకి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు.బ్రతకాలో ఎలా బ్రతక కూడదో కూడా తెలియాలంటే ఒక్కసారి జీవితం చూస్తే సరిపోతుంది.

ఆమె జీవితం మంచి చెడుల సమ్మేళనం తప్పు ఒప్పులకు మధ్య నలిగిపోయిన ఒక తెగిన గాలి పటం.ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి కూడా ఎవ్వరికీ ఆ అర్హత కానీ, ఆ అనుభవం కానీ లేవు.ఎంతగానో స్థానం అనుభవించి ఎన్నో వందల కోట్ల ఆస్తులు సంపాదించి చివరికి చనిపోయేటప్పుడు ఒంటిమీద మాంసం ముద్ద కూడా లేకుండా కేవలం అస్థిపంజరం లా కన్ను మూసింది.

సావిత్రి కి ఉన్న మందు అలవాటు గురించి కూడా మన అందరికీ తెలిసిందే.

అయితే ఆమె తాగినా, తాగకపోయినా ఎప్పుడు అబద్ధాలు చెప్పరు.మాట మార్చడం కూడా ఆమెకు అలవాటు లేదు.

నిజానికి నిలువెత్తు నిదర్శనం సావిత్రి మాత్రమే.అయితే అలాంటి సావిత్రి మాత్రం తాగిన మైకంలో చేసిన ఒక పని వల్ల అబద్దాలకోరుగా మాట పడింది.

Telugu Ravala Necklace, Sarojini Devi, Sarojinidevi, Savitri, Tollywood-Telugu S

ఓసారి ఈ హీరోయిన్ సరోజినీ దేవితో కూర్చొని ఆమె మందు తాగుతుంది ఆ సమయంలో సావిత్రి మెడలో ఉన్న రవ్వల నెక్లెస్ ని చూసి ఆమె ముచ్చట పడింది.ఎంతో బాగుంది అంటూ కితాబు ఇచ్చింది.కానీ అంతటితో ఊరుకోలేదు సరోజినీ దేవి ఓసారి పెట్టుకొని చూస్తాను ఇస్తావా అని ఈ సావిత్రిని అడిగిందట సరోజినీ దేవి.దాంతో తన మెడలో ఉన్న నక్లెస్ తీసి సరోజినీ చేతిలో పెట్టింది.

పెట్టుకొని చూడడం ఏంటి ఓసారి కావాలంటే వాడుకొని తెచ్చి మళ్ళీ ఇవ్వు అని చెప్పిందట.ఆ రోజుల్లో ఆ నెక్లెస్ విలువ కొన్ని లక్షలు ఉంటుందట.అయితే ఆ తర్వాత మళ్లీ సరోజిని సావిత్రి కష్ట కాలంలో ఉన్న సమయంలో తన నక్లెస్ గురించి అడగగా నాకు నువ్వు ఇవ్వలేదు అసలు ఆ నక్లెస్ గురించి నాకు తెలియదు నాకు ఇచ్చినట్టుగా అబద్ధం చెబుతావా అంటూ సరోజినీ దేవి మాట మార్చేశారు.అలా ఆమె నగను కోల్పోవడంతో పాటు అబద్ధం చెబుతుందనే మాటను కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది.

కానీ అప్పటికే సరోజినీ దేవి ఆ నగను తీసుకొని వేసుకున్నట్టుగా కొంతమంది చెబుతూ ఉంటారు.ఎందుకంటే సావిత్రి కి గుప్తదానాలు చేయడం మాత్రమే తెలుసు.

ఎవరి దగ్గర చేయి చాచి అడగడం తెలియదు కదా.ఇక నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube