1.నేడు కూకట్ పల్లిలో కేటీఆర్ పర్యటన

కూకట్ పల్లి నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల్లో రూ.28.51 కోట్ల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
2.కెసిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారని , కేసీఆర్ కు నిజాయితీ ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు
3.గ్రూప్ 4 నోటిఫికేషన్ జారీ

గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది .ఈ పోస్టుల కోసం పోటీపడే అభ్యర్థులు ఈనెల 23 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రకటించారు.
4.కొత్తగా 3897 వైద్య ఉద్యోగాలు
వచ్చే సంవత్సరం ఏర్పాటు చేయనున్న 9 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ జనరల్ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం 3,897 పోస్టులు మంజూరైనట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
5.చంద్రబాబు కి వ్యతిరేకంగా ఫ్లెక్సీ లు

టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
6.ఉభయగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు నిడదవోలు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పర్యటించనున్నారు .అనంతరం నిడదవోలు నియోజకవర్గం లోని వేములూరు, పసివేదల, గౌరిపల్లి, మల్లవరం ,చంద్రవరం లలో బాబు రోడ్ షో నిర్వహించనున్నారు.
7.ఏపీ గవర్నర్ తో అడ్వకేట్ జేఏసీ భేటీ

ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ తో అడ్వకేట్ జేఏసీ శుక్రవారం ఉదయం భేటీ అయింది. 8.అంబేద్కర్ వర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు మిగులు చేయట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవలు విభాగం ఇంచార్జ్ డైరెక్టర్ ఎల్వికే రెడ్డి తెలిపారు.
9.సి డబ్ల్యూ సి చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్

కేంద్ర జల వనరుల సంఘం ( సీ డబ్ల్యు సీ ) చైర్మన్ గా గోదావరి నది యాజమాన్య బోర్డ్ పూర్వపు చైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నియమితులయ్యారు.
10.ఓయూ పీహెచ్ డీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం
తొమ్మిదేళ్ల విరామం తరువాత ఉస్మానియా యూనివర్సిటీ పీ హెచ్ డీ ప్రవేశ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.
11.అధ్య కళ బృందానికి ఫ్రాన్స్ కు ఆహ్వానం
ఆదివాసీ , గిరిజన సంస్కృతి , చరిత్రకు అందించిన ఆనవాళ్లను సేకరించి వాటిని జన బహుళయంలోకి తీసుకొస్తున్న ఆర్థికల బృందానికి అరుదైన గౌరవం దక్కింది ఫ్రాన్స్ లోని నాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ వేదికగా భారత్ ఆఫ్రికా మానవీయ శాస్త్రాల సంభాషణ అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వనం అందింది.
12.ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం

ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
13.ఎమ్మెల్యేలు ఫిరాయింపులపై విచారణకు సిట్

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ నేతృత్వంలో జరిగిన విచారణ సిట్ పరిధిని మరింత విస్తరించి 2014 – 19 లో గెలిచిన కాంగ్రెస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరు ఎర వేశారు అనే విషయాన్ని వెల్లడించాలని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు.
14.కలెక్టర్ శరత్ పై చర్యలు తీసుకోవాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండర్ సెక్రటరీ రూపేష్ కుమార్ లేఖ పంపించారు.
15.ఎమ్మెల్సీ కవితను భర్తరఫ్ చేయాలి

లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది.
16.లిక్కర్ స్టాంప్ తో మాకు సంబంధం లేదు : వైసీపీ ఎంపీ
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని అమిత్ అరోరా ఎవరో తెలియదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
17.ఈడి, ఐటి దాడులకు భయపడేది లేదు

ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీలు ,ఐటీలు రైడింగ్ లు ఉంటాయని అందరికీ అర్థం అయిపోయిందని, ఆ దాడులకు ఎవరు భయపడేది లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు.
18.ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి : ఏపీ జేఏసీ
ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికమరమైన పిఆర్సి, డిఏ ,ఏరియాస్ పెండింగ్ డీఎల విడుదల సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేయాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది.
19.గుత్తి కోయలను ఆదివాసీలుగా గుర్తించాలి

గుత్తి కోయలను ఆదివాసీలుగా గుర్తించాలని ఆదివాసి అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోగుత్తి కోయలు – పోడు భూములు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు.
20.నిజామాబాద్ లో పిడిఎస్ యూ మహాసభలు
పీ డి ఎస్ యూ 22వ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ లో ప్రారంభమయ్యాయి.