సన్ ట్యాన్.ప్రస్తుత వేసవి కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ప్రధానంగా వేధించే చర్మ సమస్యల్లో ఇదే ముందు వరసలో ఉంటుంది.
ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల యూవి కిరణాలు డైరెక్ట్‌గా స్కిన్‌పై పడి చర్మ కణాలను డ్యామేజ్ చేస్తాయి.దాంతో చర్మం నల్లగా కమిలిపోయినట్లు అయిపోతుంది.
దీనిని సన్ ట్యాన్ అంటారు.ఈ సమస్య నుంచి బయట పడటం కోసం ఖరీదైన లోషన్స్, క్రీమ్స్ వాడుతుంటారు.
కానీ, న్యాచురల్‌గానే దీనిని వదిలించుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే సమ్మర్‌లో సన్ ట్యాన్ సమస్యే ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక చిన్న సైజ్ బంగాళదుంప, ఒక క్యారెట్ తీసుకుని పీల్ తొలగించి నీటితో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ రైస్ వేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఉడికించి చల్లారబెట్టుకున్న అవిసె గింజలు- బ్రౌన్ రైస్, కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప- క్యారెట్ ముక్కలు, అర కప్పు రోజ్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్నూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖం, మెడతో పాటు శరీరం మొత్తానికి పట్టించి పావు గంట పాటు డ్రై అవ్వనివాలి.అనంతరం స్క్రబ్ చేసుకుంటూ సోప్ యూస్ చేయకుండా స్నానం చేయాలి.
ఇలా మూడు రోజులకు ఒకసారి చేస్తే సన్ ట్యాన్ సమస్యకు దూరంగా ఉండొచ్చు.మరియు స్కిన్ బ్రైట్‌గా, వైట్‌గా కూడా మారుతుంది.