ఆవ నూనెలో ఈ రెండు కలిపి రాస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా మారుతుంది!

సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.ఇలాంటి వారు ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నా అట్రాక్టివ్ గా కనిపించరు.

 Mixing These Two In Mustard Oil Will Make Your Hair Thicker Details! Hair Care,-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ఒత్తైన జుట్టు( Thick Hair ) కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) రెండు స్పూన్లు తరిగిన అల్లం ముక్కలు( Ginger ) వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవ నూనె( Mustard Oil ) పోసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు అల్లం మిశ్రమాన్ని వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చిన్న మంటపై హీట్‌ చేయాలి.

Telugu Curry, Ginger, Care, Care Tips, Healthy, Latest, Mud Oil, Thick, Thick Oi

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.నూనె పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.మసాజ్ వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది.

Telugu Curry, Ginger, Care, Care Tips, Healthy, Latest, Mud Oil, Thick, Thick Oi

అలాగే ఆవనూనె, కరివేపాకు, అల్లం లో ఉండే పలు పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని( Healthy Hair ) మెరుగుపరుస్తాయి.కుదుళ్లను బలోపేతం చేస్తాయి.జుట్టు ఎదుగుదలకు ప్రోత్సహిస్తాయి.దాంతో హెయిర్ రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ట్రిపుల్ అవుతుంది.కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ ఆయిల్ ను వాడితే స‌రిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube