యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) కొరటాల శివ కాంబో మూవీ దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ తాజాగా రిలీజ్ అయింది.మెలోడీ ప్రియులను ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుండగా ఈ సాంగ్ కు వ్యూస్ కూడా రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి.ఎన్టీఆర్, జాన్వీ లుక్స్ సింప్లీ సూపర్బ్ అనేలా ఉన్నాయని ఆరేళ్ల తర్వాత తారక్ అందంగా కనిపించారని అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.
అయితే దేవర సాంగ్ కాపీ( Copy of Devara Song ) అంటూ మనికె మగే హితే సాంగ్ ( Manike mage hite song )ను పోలి ఉందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయితే రెండు సాంగ్స్ ను వింటే రెండు సాంగ్స్ మధ్య ఎలాంటి పోలిక లేదు.
కొంతమంది కావాలనే దేవర సినిమాను టార్గెట్ చేస్తూ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో ప్రతి సాంగ్ కాపీ అంటూ ట్రోల్స్ చేయడం సాధారణం అయిపోయింది.
ప్రస్తుతం ఏ సాంగ్ కాపీనో కాదో చెప్పడానికి ఎన్నో సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి.అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు కాపీ ట్యూన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది.హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఏది అసలు ట్యూన్, ఏదీ కాపీ ట్యూన్ అని తెలుసుకోలేనంత అమాయకులు కాదు.రెండు రోజుల క్రితం దేవర పోస్టర్ విషయంలో సైతం కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.
ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )కెమిస్ట్రీ ఫ్రెష్ గా ఉండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ వావ్ అనిపించాయి.జాన్వీ కపూర్ వెండితెర ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని గ్లామర్, అభినయంతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని తెలుస్తోంది.ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ మాత్రం అదుర్స్ అనిపిస్తోంది.తారక్, జాన్వీ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.