దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి( SS Rajamouli ) చాలామంది స్టార్ ప్రొడ్యూసర్స్ తో కలిసి పనిచేశాడు.
అయితే ఏ ప్రొడ్యూసర్ కూడా రాజమౌళికి కోపం తెప్పించలేదు ఒక్క అల్లు అరవింద్ తప్ప.మగధీర( Magadheera ) సమయంలో అల్లు అరవింద్ చేసిన రెండు పనులు రాజమౌళికి అసలు నచ్చలేదు.
ఈ సినిమాకి దర్శకుడు రాజమౌళి అనే సంగతి తెలిసిందే.దీనిని గీత ఆర్ట్స్ బ్యానర్ కింద అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశాడు.దాదాపు రూ.44 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.150 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఈ మూవీపై రాజమౌళి చాలా హోప్స్ పెట్టుకున్నాడు.దీనిని అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా తీశాడు.ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి.
ఫైట్ కూడా బాగుంటాయి.ఫైట్లు, పిరియాడికల్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.
ఈ మూవీ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది.దీన్ని పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని జక్కన్న ఎంతో ఆశపడ్డాడు.
అయితే అలాగే చేద్దాం అని అల్లు అరవింద్ ముందు నుంచి చెబుతూ వచ్చాడు.చివరికి మాత్రం ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ కే దీనిని పరిమితం చేశాడు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయలేకపోయాడు.దీనివల్ల రాజమౌళికి చాలా కోపం వచ్చింది.
వాస్తవానికి గీతా ఆర్ట్స్ ( Geetha Arts )ఈ చిత్రాన్ని 2009 జులై 31న ప్రపంచవ్యాప్తంగా 1250 థియేటర్లలో 625 డిజిటల్ యూఎఫ్ఓ మూవీజ్ ప్రింట్లతో రిలీజ్ చేసింది.కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లోనే 1000 కంటే ఎక్కువ స్క్రీన్స్‌లో మగధీర విడుదలైంది.మగధీర ఓవర్సీస్లో దాదాపు 40 లొకేషన్లలో 25 ప్రింట్లతో, ఉత్తర అమెరికాలో 21 స్క్రీన్లలో విడుదలై సంచలనాలు సృష్టించింది.కానీ రాజమౌళి మాత్రం భారతదేశ వ్యాప్తంగా ఇది హిట్ అయితే బాగుండేది అని కోరుకున్నారు.
రాజమౌళికి కోపం తెప్పించేలా అల్లు అరవింద్ చేసిన మరో పని ఏంటంటే ఈ సినిమాని కొన్ని సెంటర్లలో బలవంతంగా 200 రోజులు ఆడించాలని ప్రయత్నించాడు.ఇది రాజమౌళికి అసలు నచ్చలేదు.
సినిమాలో దమ్ముంటే అదే జెన్యూన్ గా ఎక్కువ రోజులు ఆడుతుందని, ఇలా అడ్డదారుల్లో ఆడించాల్సిన అవసరం లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు.ఈ సినిమా తర్వాత అల్లు అరవింద్, రాజమౌళి మళ్లీ కలిసి సినిమా చేసిన దాఖలు లేవు.
ఈరోజుల్లో జక్కన్నతో సినిమా తీస్తే ఈజీగా 500 కోట్ల లాభం సంపాదించవచ్చు.కానీ అంతే రేంజ్ లో బడ్జెట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.
అందుకు అల్లు అరవింద్ సాహసిస్తారా అనేదే ప్రశ్న.