1.అసెంబ్లీ కి చేరుకున్న కేసీఆర్
బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ కి చేరుకున్నారు.
2.కేసీఆర్ పై గవర్నర్ ప్రశంసలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రశంసలు కురిపించారు.
3.గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.నూతన సచివాలయానికి బయలుదేరిన టి.కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు రవి, షబ్బీర్ అలీ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
4.కేఏ పాల్ కామెంట్స్
కేసిఆర్ తెలంగాణ లో నీ గుండాయిజం ఏంటి అంటూ కే ఏ పాల్ ప్రశ్నించారు.
5.బీబీసీ డాక్యుమెంటరీ విభాగం పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఆరోపణలతో పాటు, ప్రధాని నరేంద్ర మోది రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ పై నిషేధాన్ని సవాల్ చేస్తూ, దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
6.జగనన్న విదేశీ విద్య నిధులు విడుదల
జగనన్న విదేశీ విద్య దీవెన సహాయం కింద 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా 19.95 కోట్ల ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
7.జగన్ పై చంద్రబాబు మండిపాటు
ఏపీ సీఎం జగన్ పై టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు.జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అని , ప్రతిపక్షాలను అణిచివేసేందుకే జీవో నంబర్ 1 ని తీసుకువచ్చారని జగన్ మండిపడ్డారు.
8.భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు
భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.84 రోజులకు గాను మొత్తం 2 కోట్ల 20 లక్షల 91 వేల 906 వచ్చింది.
9.నేడు షూటింగ్స్ బంద్
ప్రముఖ రచయిత, దర్శకుడు కె.విశ్వనాథ్ మరణంతో చిత్ర సీమలో తీవ్ర విషాదం నెలకొంది.ఆయన మరణానికి సంతాప సూచకంగా నేడు టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిపివేశారు.
10.ఎమ్మెల్యే శ్రీదర్ రెడ్డి సంచలన కామెంట్స్
తన గొంతు ను ఆపాలంటే తనను ఎన్ కౌంటర్ చేయడం ఒక్కటే మార్గమని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై సంచలన విమర్శలు చేశారు.
11.లోకేష్ కామెంట్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై లోకేష్ కామెంట్స్ చేశారు.
12.పవన్ కళ్యాణ్ కామెంట్స్
జనసేన కు కార్యకర్తలే బలమని, వారే సంపద అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.మూడో విడత జనసేన క్రీయాశీలక సభ్యత్వ నమోదు ను విజయవంతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు.
13.పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానం
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో బీఆర్ ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
14.ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో మంటలు
అబుధబి నుంచి కాలికట్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్స్ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.దీంతో ఆ విమానాన్ని అబూదబి ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా దించేశారు.
15.తిరుమల సమాచారం
తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 14 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు.
16.నాందేడ్ లో కేసీఆర్ సభకు ఏర్పాట్లు
మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఈ నెల 5 న సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.దీనికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
17.అనాథల సంక్షేమం పై చట్టం చేయండి
అనాథల సంక్షేమం పై సమగ్ర చట్టం చేయాలని ఎం ఆర్ పీ ఎస్ అనాథ హక్కుల పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు.
18.లిక్కర్ స్కాం తో సంబంధం లేదు
లిక్కర్ స్కాం తో బీ ఆర్ ఎస్ నేతలకు ఎటువంటి సంబంధం లేదని , బీజేపీ ఎన్ని ఛార్జి షీట్లు పెట్టినా తాము భయపడేది లేదని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సి భాను ప్రసాద్ అన్నారు.
19.బీఆర్ ఎస్ లో మహారాష్ట్ర నాయకుల చేరిక
మహా రాష్ట్ర కు చెందిన పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు బీ ఆర్ ఎస్ లో చేరారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 53,100
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 57,930
.