సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు.ఇక ఇక్కడ ఏ హీరో అయిన కూడా వాళ్లకంటు ఒక సపరేట్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి.
ఇక లేకపోతే మాత్రం వాళ్ళు ఎక్కువ రోజులపాటు కొనసాగడం చాలా కష్టం అవుతుంది.ఇక ఈ వచ్చిన సినిమాలను వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఇక్కడ కెరియర్ అనేది లాంగ్ టైం నిలబడలేదు.
అందుకే ఒక హీరో ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తాడా? లేదంటే కమర్షియల్ సినిమాలు చేస్తాడా అనేది ముందుగానే నిర్ణయించుకొని మొదట్లో కొన్ని సక్సెస్ వచ్చేవరకు అదే జానర్ లో కంటిన్యూ అయిపోవాలి.
ఇక తనకంటూ ఒక స్టేజ్ ఏర్పడిన తర్వాత డిఫరెంట్ సినిమాలను ట్రై చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగిపోవాలి.ఇక ఇలాంటి క్రమంలోనే నాగర్జున కూడా మొదట్లో వైవిద్య భరితమైన సినిమాలను చేశాడు.ఇక శివ సినిమాతో ఆయనకు కమర్షియల్ సక్సెస్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో తను స్టార్ హీరోగా నిలబడ్డాడు.
ఇక అప్పటినుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటు ముందుకు వెళ్తున్నాడు.ఇక అందుకు ఉదాహరణగా అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలను మనం చెప్పుకోవచ్చు… అయితే నాగార్జున తన కెరియర్ లో ఎలాంటి ఎక్స్పరిమెంట్లు చేసి సక్సెస్ లను అందుకున్నాడో ఇప్పుడు నాగచైతన్య( Naga Chaitanya) మాత్రం అలాంటి పనులు చేయడం లేదు.
అందుకే ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు.అంతే తప్ప టాప్ హీరో రేంజ్ కి వెళ్లడం లేదు.ఇక నాగచైతన్య సినిమా సెలక్షన్స్ కనక మనం చూసుకున్నట్లయితే దూత అనే వెబ్ సిరీస్( Dhootha Web Series ) చేసి తను మంచి పని చేశాడు.ఆ సిరీస్ లో తాను ఒక మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడు.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ రెండింటికి ముందు ఆయన రొటీన్ రెగ్యులర్ కథలను ఎంచుకొని సినిమాలు చేశాడు.
కానీ ఇప్పుడు మాత్రం తన సినిమా సెలక్షన్ లో ఒక మెచ్యూరిటీ అయితే కనిపిస్తుంది.మరి దానికి తగ్గట్టుగానే ఆ సినిమాలతో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.