గోడకుర్చీ( wall chair ) అనగానే దాదాపు అందరికీ తమ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తూ ఉంటాయి.స్కూల్ లో ఏదైనా తప్పు చేస్తే టీచర్ వేసే పనిష్మెంట్స్ లో గోడకుర్చీ ఒకటి.
అప్పట్లో అందరూ గోడ కుర్చీని కఠినమైన శిక్షలా భావించేవారు.కానీ వాస్తవానికి గోడకుర్చీ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం.
గోడకుర్చీ కూడా ఒక వ్యాయామం లాంటిదే.రోజుకో ఐదు నిమిషాలు గోడకుర్చీ వేయడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
గోడకుర్చీని వాల్ స్క్వాట్ లేదా వాల్ సిట్టింగ్ అంటారు.ఇది మన శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని( Mental health ) సైతం మెరుగుపరుస్తుంది.ఒక మంచి ప్లేస్ లో ఐదు నిమిషాల పాటు గోడకుర్చీ వేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.మనసు తేలిక గా మారుతుంది.
ఏకాగ్రత పెరుగుతుంది.అలాగే బీపీని నియంత్రించడానికి వాకింగ్, సైకిలింగ్ వంటి వ్యాయామాలు చేయమని వైద్యులు సూచిస్తుంటారు.
అయితే ఇవే కాదు వాల్ సిట్టింగ్ కూడా బీపీని నియంత్రించగలదు.రోజూ ఐదు నిమిషాల పాటు గోడకుర్చీ వేస్తే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది.
రక్త ప్రసరణ( blood circulation ) మెరుగుపడుతుంది.ఫలితంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది.
బద్దకాన్ని దూరం చేయడంలో గోడకుర్చీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఐదు నిమిషాల పాటు వాట్ సిట్టింగ్ వేశారంటే శరీరం చురుగ్గా మారుతుంది.బద్ధకం పరార్ అవుతుంది.వాల్ సిట్టింగ్ శరీర భంగిమ మరియు అమరికను ఫిక్సింగ్ చేయడంలో కూడా తోడ్పడుతుంది.ఇది వెన్నెముకను తటస్థంగా ఉంచుతుంది.
అంతేకాదు గోడ కుర్చీ వేడటం వల్ల కాళ్లు, తొడలు బలోపేతం అవుతాయి.ఎక్కువ సేపు నడిచినా.పనిచేసినా అలసట రాకుండా ఉంటుంది.
శరీరంలోని కండరాల పటుత్వానికి గోడ కుర్చీ తోడ్పడుతుంది.మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.
గోడకుర్చీ వేయడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు.వాల్ సిట్టింగ్ కండరాలను ఎక్కువ సమయం పాటు సంకోచించేలా చేస్తాయి.
ఇది అధిక కేలరీలు ఖర్చు అయ్యేందుకు మద్దతు ఇస్తుంది.