ఈ మొబైల్ యాప్ తో మీ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు

ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్ కి వెళితే బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయించుకుంటూన్నాం కాని బ్లడ్ షుగర్ లెవల్స్ టెస్ట్ చేయించుకుంటున్నామా? చాలామంది అలసత్వం ప్రదర్శిస్తారు.అందుకే షుగర్ వచ్చే దాకా తెలియట్లేదు.

 You Can Test Blood Sugar Levels With This Mobile App-TeluguStop.com

ముందుజాగ్రత లేకపోవడం వలనే షుగర్ వ్యాధితో ఇబ్బందిపడేవారి సంఖ్య పెరిగిపోతోంది.బయటకి చిన్న చిన్న క్లీనిక్స్ లో 50-100 రూపాయల్లోనే బ్లడ్ షుగర్ లెవల్స్ టెస్టులు చేస్తున్నారు.

ఒకవేళ మీకు ఆ 50-100 కూడా ఎందుకు పెట్టడం, అక్కడిదాకా వెళ్ళడం ఎందుకు అనిపిస్తే, మీ లాంటి బద్దకస్తుల కోసమే ఇంగ్లాండ్ వారు ఒక సూపర్ యాప్ ని తీసుకొస్తున్నారు.ఈ మొబైల్ యాప్ తో మీరు ఇంట్లోనే బ్లడ్ షుగర్ లెవల్స్ టెస్టు చేసుకోవచ్చు అంట.అది కూడా ఒక్క రక్తం చుక్క కూడా ఉపయోగించకుండా.

ఈ యాప్ పేరు Epic Health.

దీనితో టైప్ 1 అండ్ టైప్ 2, రెండురకాల డయాబెటిస్ ని కనిపెట్టవచ్చు.ఇక టెస్టు ఎలా చేయాలి అనే కదా మీ అనుమానం.

ఈ యాప్ ఓపెన్ చేసి కెమెరా లెన్స్ మీద మీ వేలిముద్ర వేయాలి.అప్పుడు ఈ యాప్ మీ ఫింగర్స్ టిప్స్ యొక్క క్లోజప్ షాట్స్ కొన్ని తీసుకుంటుంది.దీనిద్వారా మీ హార్ట్ రేట్, ఉష్ణోగ్రత, బ్లడ్ ప్రెషర్, రేస్పిరేటరి రేట్, రక్తంలో ఆక్సిజన్ శాతం, అలాగే రక్తం లో షుగర్ లెవెల్స్ ని కనిపెడుతుందట.

“ఈ యాప్ ఒక సులువైన ప్రోటోకాల్ ని ఉపయోగిస్తుంది.దీని ద్వారా యూజర్స్ నాన్ ఇన్వేసీవ్ టెస్ట్ చేసుకొని, తమ చేతివేళ్ళ ద్వారా యాప్ కి సమాచారం అందించవచ్చు.దీని ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ ని వినియోగదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇది కరెక్టు ఫలితాలను వెల్లడిస్తుంది.దీన్ని ఉపయోగించు షుగర్ ని అడ్డుకోవచ్చు.

అంతే కాదు, ఈ యాప్ ఇన్సులిన్ రెసిస్టన్స్ లెవల్స్ ని కూడా ట్రాక్ చేసి, మీరు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందొ లేదో కూడా చెప్పగలదు.కాబట్టి షుగర్ ఇప్పటికే ఉన్నా, లేకున్నా, ఈ యాప్ మీకు పనికివస్తుంది.

విశేషం ఏమిటంటే, దీనికి మీ రక్త పరీక్షలు అవసరం లేదు.ఇది టెక్నాలజీ మీకు అందించబోతున్న అధ్బుతం” అన్నారు డయాబెటిస్ డాక్టర్ డాన్ హోవార్త్.

ఇంకేం వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్లడ్ షుగర్ టెస్టు చేసుకుందాం అనుకుంటున్నారా … కాస్త ఓపిక పట్టండి.ఎందుకంటే ఈ యాప్ ఇంకా పూర్తిగా సిద్ధంగా లేదు.

ఇంకా దీని మీద పని చేస్తున్నారు.ఈ ఏడాది చివర్లో దీన్ని విడుదల చేసే అవకాశం ఉందట.

ఇది ఉపయోగకరమైన యాప్ కదా, డౌన్లోడ్ చేసుకోవాలంటే డబ్బు ఎక్కువే పెట్టాలేమో అనుకునేరు .దీన్ని పూర్తి ఉచితంగా ఇవ్వబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube