భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు.వారిలో యూట్యూబర్ జెరాన్ కాంపనెల్లా ( Jeron Campanella )ఒకరు.
తన నమ్మకాన్ని పరీక్షించడానికి ఏకంగా అంటార్కిటికాకే వెళ్లారు.కాలిఫోర్నియా( California ) నుంచి దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి, 37,000 డాలర్లు ఖర్చు (రూ.31 లక్షలు) చేసి అక్కడికి చేరుకున్నారు.“అంటార్కిటికా ఓ మంచు గోడ, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు” అని బలంగా నమ్మారు కాంపనెల్లా.కానీ అక్కడ చూసింది వేరు.
అంటార్కిటికాలో దక్షిణ వేసవిలో సూర్యుడు అస్తమించడు.
ఈ నిజం కాంపనెల్లాను షాక్‌కు గురి చేసింది.తన యూట్యూబ్ ఛానెల్‌లో ( YouTube channel )ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.“అంటార్కిటికాలో 24 గంటల సూర్యుడు ఉండడని అనుకున్నాను.కానీ నేను అనుకున్నది తప్పు.” అని నిజాయితీగా చెప్పారు.తన ఫ్లాట్ ఎర్త్ మ్యాప్ తప్పని తేలిందని అంగీకరించారు.
ఐనా, తన నమ్మకాన్ని పూర్తిగా వదులుకోలేదు.అదే ఇక్కడి ట్విస్ట్.
అసలు ఈ ఫ్లాట్ ఎర్త్ వాదనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కొలరాడో పాస్టర్ విల్ డఫీ ఒక సాహసోపేతమైన ప్రయోగం చేశారు.“ది ఫైనల్ ఎక్స్‌పెరిమెంట్” ( The Final Experiment )పేరుతో నలుగురు ఫ్లాట్ ఎర్త్ నమ్మేవాళ్లను, నలుగురు భూమి గోళాకారంలో ఉందని నమ్మేవాళ్లను అంటార్కిటికాకు తీసుకెళ్లారు.మిడ్‌నైట్ సన్ (సూర్యుడు 24 గంటలు అస్తమించకపోవడం) చూడటమే లక్ష్యం.ఇలాంటి దృగ్విషయం భూమిలాంటి గ్లోబ్ లేదా గోళంపైనే సాధ్యం.అయితే పాస్టర్ విల్ డఫీ “ది ఫైనల్ ఎక్స్‌పెరిమెంట్” ద్వారా మిడ్‌నైట్ సన్ దృగ్విషయాన్ని చూపించి, భూమి గోళాకారమని శాస్త్రీయంగా నిరూపించారు.
“ఈ ప్రయోగంతో వాదనకు ముగింపు పలకవచ్చు” అని డఫీ ధీమాగా చెప్పారు.అంటార్కిటికాను ఎవరైనా సందర్శించవచ్చని, భూమి ఆకారాన్ని దాచడానికి ఎవరినీ అనుమతించరనే వాదన తప్పని నిరూపించారు.కాంపనెల్లా యాత్ర, డఫీ ప్రయోగం… ఇవన్నీ భూమి గోళాకారంలో ఉందనే శాస్త్రీయ సత్యాన్ని మరింత బలంగా నిరూపిస్తున్నాయి.