తారక్ కొత్త లుక్ చూసి తెగ టెన్షన్ పడుతున్న అభిమానులు.. లుక్ బాలేదంటూ?

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన తారక్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Fans Are Getting Tensed After Seeing Tarak's New Look, But Are They Saying That-TeluguStop.com

ఇప్పుడు అదే ఊపుతూ మరిన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.అందులో భాగంగానే తారక్ ప్రస్తుతం వార్ 2( War 2 ) షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

Telugu Fans Taraks, Fans, Jr Ntr, Ntr Fans Tarak, Tollywood-Movie

అతి త్వరలోనే ప్రశాంత్ నీల్( Prashant Neel ) తో సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నారు.ఈలోపు ఎన్టీఆర్ ఒక కమర్షియల్ యాడ్ చేసారట.ఆన్ లైన్ సరుకులను డెలివరీ చేసే జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ కనిపించారు.ఈ మధ్యన ఎన్టీఆర్ 14 కేజీలు తగ్గినట్లుగా తెలిపారు.అంతేకాకుండా ఎన్టీఆర్ జిమ్ లుక్ కూడా రీసెంట్ గా వైరల్ అయిన విషయం తెలిసిందే.దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహపడ్డారు.

కానీ ఇప్పుడు జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ లుక్ చూసి చాలామంది నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, లుక్స్ గురించి కనిపిస్తున్న కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

Telugu Fans Taraks, Fans, Jr Ntr, Ntr Fans Tarak, Tollywood-Movie

యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చెయ్యడం కన్నా ఎన్టీఆర్ అభిమానులకే ఎన్టీఆర్ కొత్త లుక్ షాక్ ఇచ్చింది.ఫేస్ లో చాలా తేడా కనిపించడం, ఆ హెయిర్ స్టయిల్ ఎన్టీఆర్ కి మ్యాచ్ అవ్వకపోవడం అభిమానుల ఆందోళనకు కారణం.మరి ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ లుక్ పై ఇప్పడు ఫ్యాన్స్ లో అనుమానం మొదలైంది.మరి ఎన్టీఆర్ ఇదే లుక్కు ఇదే హెయిర్ స్టైల్ లో కనిపిస్తారా లేదంటే సినిమాలో హెయిర్ స్టైల్ మారుస్తారా అన్నది చూడాలి మరి.ఈ విషయం పట్ల అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube