తల మరియు వెంట్రుకల శుభ్రత కోసం వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేస్తుంటాం.ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.
ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరమైన చర్య.హెడ్ బాత్ వల్ల తల మీద పేరుకుపోయే ధూళి, చెమట, ఆయిల్ ( Dirt, sweat, oil )మరియు మృతకణాలు తొలగిపోతాయి.
తల మరియు వెంట్రుకల శుభ్రంగా మారతాయి.అదే సమయంలో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది.నిద్ర కూడా బాగా పడుతుంది.
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తలస్నానం చేయకూడదు.
ప్రధానంగా రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు.
రాత్రివేళ తలస్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జలుబు, తలనొప్పి, నిద్రలేమి ( Cold, headache, insomnia )వంటి సమస్యలు తలెత్తవచ్చు.జ్వరం ఉన్నప్పుడు తలస్నానం చేయడం అస్సలు కరెక్ట్ కాదు.
ఈ సమయంలో తలస్నానం చేస్తే చలి పుట్టి జ్వరం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

అలాగే తలనొప్పిగా( headache ) ఉన్నప్పుడు కొందరు రిలీఫ్ కోసం తలస్నానం చేస్తారు.కానీ ఈ పొరపాటు ఇకపై చేయకండి.తలనొప్పి ఉన్నపుడు తలస్నానం మరీ ముఖ్యంగా చల్లని నీటితో తలస్నానం చేస్తే మైగ్రేన్ వంటి సమస్యలు పెరుగుతాయి.
భోజనం చేసిన వెంటనే తలస్నానం చేయకూడదు.అలా చేస్తే మానసిక మాంద్యం, అజీర్ణం మరియు అలసటకు దారితీయవచ్చు.

నెలసరి సమయంలో కొంతమందికి తలస్నానం చేసిన తర్వాత రక్తస్రావం తక్కువగా మారుతుంది, తలస్నానం వల్ల రక్తనాళాల విస్తరణ జరుగుతుందని.దీని వల్ల హవీ ఫ్లో అవుతుందని కొన్ని వాదనలు ఉన్నాయి.అందువల్ల మీరు కూడు ఇటువంటి సమస్యను ఫేస్ చేస్తే నెలసరి మొదటి మూడు రోజులు తలస్నానం చేయకపోవడమే బెటర్.ఇక తీవ్రమైన అలసటతో బాధపడుతున్నప్పుడు, తక్కువ నిద్రపోయినప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత తలస్నానం చేయకూడదు.
అలా చేస్తే తలనొప్పి, మైకం వచ్చే అవకాశం ఉంటుంది.