సమ్మర్ సీజన్ ( Summer season )వచ్చేసింది.ఎండలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి.
వేసవి కాలంలో బాడీ హీట్ ను తగ్గించడానికి, అధిక దాహాన్ని అదుపులో ఉంచేందుకు కొన్ని కొన్ని పానీయాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.కొబ్బరి నీళ్లు కూడా ఆ కోవకు చెందినవే.
కొబ్బరి నీళ్లు సహజమైన ఎనర్జీ డ్రింక్‌గా పరిగణించబడతాయి.ఇవి తక్కువ క్యాలరీలు కలిగి ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పుష్కలమైన పోషకాలు అందిస్తాయి.
అయితే మధుమేహం( diabetes ) ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? అన్న సందేహం చాలా మందికి ఉంది.
వాస్తవానికి మధుమేహం ఉన్న కూడా కొబ్బరి నీళ్లు( Coconut water ) తాగొచ్చు.
కానీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.కొబ్బరి నీళ్లు లో-క్యాలరీ డ్రింక్.
సహజమైన చక్కెరలు కలిగి ఉంటాయి.పొటాషియం, సోడియం, మాగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు బాడీని హైడ్రేట్‌గా ఉంచుతాయి.
పైగా ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే లక్షణాలను కొబ్బరి నీళ్లు కలిగి ఉంటాయి.అందువల్ల మధుమేహం ఉన్నవారు రోజుకు అర గ్లాస్ వరకు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు.
అంతకు మించి తీసుకుంటే బ్లడ్ షుగర్ ఎక్కువగా మారే అవకాశం ఉంటుంది.అలాగే తాజా కొబ్బరి నీళ్లు మాత్రమే తాగాలి.
ప్యాకెజ్డ్ కొబ్బరి నీళ్లు షుగర్ కలిపి ఉండే అవకాశం ఉంది.

అధిక వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, కొబ్బరి నీళ్లు తాగితే బాడీ దెబ్బకు కూల్ అవుతుంది.కొబ్బరి నీళ్లు శరీరానికి తగినంత తేమను అందించి వేడి దెబ్బ ప్రమాదాన్ని తగ్గించగలవు.అలసట, నీరసం ( Fatigue, lethargy )ఎక్కువగా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే వేగంగా రికవరీ అవుతారు.
కొవ్వును కరిగించి మెటాబాలిజంను పెంచడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి.తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గే వారికీ ఇది మంచి డ్రింక్ అవుతుంది.

అంతేకాదు, కొబ్బరి నీళ్లు మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ మూత్రవిసర్జన ద్రవంగా పనిచేస్తుంది.మూత్ర మార్గ ఇన్ఫెక్షన్ల ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ డి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.







