సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది లాంగ్ హెయిర్ ( Long hair )ను ఇష్టపడుతుంటారు.కానీ ఒత్తిడి, కాలుష్యం, హెయిర్ కేర్ లేకపోవడం, రసాయనాలు అధికంగా ఉండే కేశ ఉత్పత్తులను వాడడం తదితర కారణాల వల్ల హెయిర్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు.
అయితే ఇప్పుడు చెప్పబోయే టానిక్ హెయిర్ గ్రోత్ ను పెంచడానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.లాంగ్ హెయిర్ కోసం ఆరాట పడే అమ్మాయిలు ఈ టానిక్ ను వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

టానిక్ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం( Rice ) వేసుకోవాలి.అలాగే అంగుళం దాల్చిన చెక్కను( Cinnamon ) చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ ఆవ నూనె( Mustard oil ) , వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలి.టానిక్ అప్లై చేసుకున్న గంట లేదా గంటన్నర అనంతరం రసాయనాలు లేని తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడితే మీ జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.అలాగే ఈ టానిక్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.
కురులకు కొత్త మెరుపును జోడిస్తుంది.కాబట్టి లాంగ్ హెయిర్ ను ఇష్టపడేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పిన టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.







