మన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలకైనా సులభముగా సమర్థవంతమైన పరిష్కారాలను ఆయుర్వేదం ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది.ఈ పురాతన వైద్యశాస్త్రం( Medicine ) మన చుట్టూ పెరిగే మొక్కలు, మన వంటగదిలో లభించే పదార్థాలతోనే అద్భుత చికిత్సలను అందిస్తూ ఉంటుంది.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బియ్యం ద్వారా లభించే గంజిలో శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఎన్నో ఉన్నాయి.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ( Antioxidants )విటమిన్లు, ఖనిజాలు మీ జుట్టుకు, చర్మ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు వైట్ డిశ్చార్జ్, మూత్ర విసర్జనలో మంట, విరోచనాలు, రక్తస్రావం మొదలైన సమస్యలకు అద్భుతమైన ఔషధంగా గంజి పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మహిళల ఆరోగ్యానికి గంజినీరు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు ఈ అద్భుతమైన అమృతాన్ని సిద్ధం చేయవచ్చో నిపుణులు చెబుతున్నారు.గంజినీరు తయారీకి ఆయుర్వేద నిపుణులు చెప్పిన సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.10 గ్రాముల బియ్యాన్ని తీసుకొని ఒకేసారి కడగాలి.

మట్టికుండ లేదా స్టైన్లెస్ స్టీల్ గిన్నెలో కడిగిన బియ్యం వేసి అందులో 60 నుంచి 80 మిల్లీలీటర్ల నీరు పోసి సుమారు రెండు నుంచి ఆరు గంటల పాటు మూత పెట్టి ఉంచాలి.ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలిపి తయారైన తెల్లటి ద్రవాన్ని ఒక గిన్నెలో ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకోవాలి.గంజినీరు సిద్ధం అయిన తర్వాత దీన్ని మీరు రోజంతా తాగవచ్చు.
ఇది సుమారు 6 నుంచి 8 గంటల వరకు నిల్వ ఉంటుంది.బియ్యాన్ని ఆవిరిలో ఉడికించకూడదు.
పైన సూచించినట్లుగానే తయారు చేస్తేనే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ గంజినీరు( Porridge ) సహజమైన ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది.మీ బలహీనతను, నిరసాన్ని, అలసటను ఇది తక్షణమే దూరం చేస్తుంది.గంజినీరు తీసుకోవడం వల్ల మూత్రంలో మంట, విరోచనాలు,( Antics ) అధిక రక్తస్రావం, నెలసరి సమస్యలలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ గంజి తాగితే అరచేతులు, అరికాళ్ళలో మంట కూడా తగ్గిపోతుంది.ఇంకా చెప్పాలంటే వైట్ డిశ్చార్జ్ తో బాధపడుతున్న ప్రతి మహిళ గంజినీరు తాగితే ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.