విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా పెదరాయుడు.ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుంది అని చెప్పాలి.
ఈ సినిమా స్టోరీ చూస్తే ఎంతో సాఫీగా సాగిపోతున్న కథలో ఊహించని మలుపు ఉంటుంది.ట్విస్టు రావడానికి కారణం పెదరాయుడు చిత్రంలో ఒక టీచర్ పాత్ర.
ఇక ఆ టీచర్ పాత్రలో నటించింది శుభశ్రీ .కనిపించింది కొంతసేపు అయినా తన పాత్రతో తెలుగు ప్రేక్షకుల అందరి చూపులూ ఆకర్షించి అందం అభినయంతో గుర్తింపును సంపాదించుకుంది.
పెదరాయుడు సినిమా తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది శుభశ్రీ.శుభశ్రీ ఎవరో కాదు తమిళనాట సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ మాలాశ్రీ చెల్లెలు కావడం గమనార్హం.
అయితే ఇక ఇలా పెదరాయుడు సినిమాలో టీచర్ పాత్రలో కనిపించిన శుభశ్రీ బ్యాగ్రౌండ్ గురించి చేసిన సినిమాల గురించి మాత్రం చాలామందికి తెలియదు.ఇక ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి చిన్న హీరోల సరసన ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శుభశ్రీ.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమా లో చలాకి అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకర్షించింది.అందరూ అందరే సినిమా తెలుగులో హీరోయిన్గా అడుగుపెట్టింది.గ్యాంగ్ మాస్టర్, పోకిరి రాజా మా ఆవిడ కలెక్టర్, కుర్రాళ్ళ రాజ్యం, కలియుగం లో గందరగోళం, పెద్దన్నయ్య లాంటి ఇంకా ఎన్నో సినిమాల్లో కూడా నటించింది.
ప్రస్తుతం శుభశ్రీ నటనకు గుడ్బై ప్రస్తుతం బెంగళూరు లో ఉంటుంది అని తెలుస్తోంది.శుభశ్రీ భర్తకు కర్ణాటకలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయట.ఇక నటన గురించి మళ్ళీ ఆలోచన చేయకుండా పిల్ల పాపలతో సంతోషంగా ఉందట.శుభశ్రీ.