శాస్త్రీయ సంగీతం విన్నప్పుడు మెదడులో ఏం జరుగుతుందంటే..

మీరు శాస్త్రీయ సంగీతాన్ని విన్నప్పుడు అది మిమ్మల్ని మరింత తెలివిగా మారుస్తుందని అనడాన్ని మీరు వినే ఉంటారు.శాస్త్రీయ సంగీతం సంగీతానికి యాంటీఆక్సిడెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

 How Classical Music Affects Brain , Classical Music , Brain , Relax The Mind ,-TeluguStop.com

ఒక సిద్ధాంతం ప్రకారం ఉద్విగ్నమైన టెంపోతో కూడిన సంగీతం మన హృదయ స్పందన రేటును మారుస్తుంది.అది మనకు శక్తినిస్తుంది.

ఇంకా వినాలని, హాయిని పొందాలని అనిపిస్తుంది.BBC చేపట్టిన ఒక అధ్యయనంలో అవరోహణ రాగాలు మనపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతాయని తేలింది.

ఈ దశలో మనం మరింత విశ్రాంతిని పొందుతాము.మధురమైన సంగీతానికి సానుకూలంగా ప్రతిస్పందిస్తాం.2014లో నేచర్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో సంగీతానికి మన మెదడులోని భాగాలను ఉత్తేజపరిచే సామర్థ్యం ఉందని తెలియజేశారు.యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో విద్యార్థుల బృందం ముందు మ్యూజిక్ వాయించి వారి ఐక్యూ స్థాయి పెరుగుదలను గమనించారు.

ఈ ప్రయోగం చాలా మంది శాస్త్రవేత్తలకు ముఖ్యమైన సాక్ష్యంగా నిలిచింది.

శాస్త్రీయ సంగీతం మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడయ్యింది.

శాస్త్రీయ సంగీతాన్ని వినడం వల్ల మనకు విశ్రాంతి మరియు ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు.ఇది మనల్ని మానసికంగా మెరుగ్గా ఉండేలా చేస్తుంది.

సంగీతం మన ఆలోచనలను కూడా మార్చగలదు. డాక్టర్ కెవిన్ లాబార్ చేసిన ఒక ప్రత్యేక అధ్యయనంలో సంగీతానికి మన పనితీరును మెరుగుపరిచే శక్తి ఉందని తేలింది.

ఎందుకంటే మనం ప్రశాంతమైన శాస్త్రీయ సంగీతాన్ని వింటూ ప్రశాంతంగా, రిలాక్స్‌గా మారినప్పుడు డోపమైన్ విడుదల అవుతుంది.ఇది ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ల విడుదలను నిరోధిస్తుంది.

అంటే మానసిక స్థితి మెరుగుపరుస్తుంది.అప్పుడు మనం చేస్తున్న పనిని ఆనందంగా చేయగలుగుతాం.

శాస్త్రీయ సంగీతాన్ని వినడం వలన మనస్సు విశ్రాంతిని, ప్రశాంతతను పొందుతుంది.తద్వారా మనసు ఉత్సహంతో పని చేస్తుంది నిద్రాణమైన సృజనాత్మకతను తట్టిలేపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube