తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి తెలియని వారు లేరు.సంచలనాలకు మారుపేరుగా మారిన ఈయన ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూతో కాంట్రవర్సీలో నిలుస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు.
ఇక అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ లు సాధించడం లేదు.ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన విజయన్నైతే అందుకోవడం లేదు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వర్మ ‘వ్యూహం ‘ ( Vyuham )అనే సినిమా చేశాడు.ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది.మరి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు.ఇక ఇదిలా ఉంటే వర్మ నాగార్జున( Nagarjuna ) ని ఒక విషయంలో మోసం చేశాడని చాలా మందికి తెలియదు.అది ఏంటి అంటే వర్మ వెంకటేష్ తో చేసిన క్షణక్షణం సినిమాని ( kshanam kshanam movie )నాగార్జున తో చేయాల్సింది.
శివ సినిమా టైంలోనే ఈ స్టోరీని వర్మ నాగార్జునకి చెబితే అప్పుడు నాగ్ కూడా ఓకే చెప్పాడట.ఆ తర్వాత నాగార్జున బిజీగా ఉన్న సమయంలో ఆయన కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక వెంకటేష్ ని పెట్టి వర్మ ఈ సినిమాను చేశాడు.
ఇంక దాంతో నాగార్జున వర్మ మీద కొద్ది రోజులపాటు సీరియస్ గా ఉన్నట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఇక మొత్తానికైతే వర్మ మళ్లీ నాగార్జునని కూల్ చేసి ఆయనతో మరికొన్ని సినిమాలను కూడా తెరకెక్కించాడు…ఇలా వీళ్లిద్దరి మధ్య ఇప్పటికీ కూడా మంచి అనుబంధం ఉంది…
.