మన భారతదేశంలో ఎన్నో కుల మతాలకు నిలయం.ఈ విధంగా ఒక్కో మతం వారు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
ముస్లిములు అల్లాను ప్రార్థిస్తే, క్రైస్తవులు ఏసుప్రభు కొలుస్తారు.బౌద్ధులు బుద్ధుడిని ప్రార్థిస్తారు.
కానీ హిందువులు మాత్రం ఆంజనేయ స్వామి, శివుడు, నారాయణుడు, శ్రీరాముడు, అమ్మవారు అంటూ వివిధ దేవతలను పూజిస్తారు.ఈ విధంగా హిందువులు మాత్రమే ఇంత మంది దేవతలను పూజించడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం దొరకదు.అయితే పురాణాల ప్రకారం మనకు ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం…
హిందువులు అంతమంది దేవుళ్లను ఎందుకు పూజిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా… తల్లి తన బిడ్డకు ఆకలి వేస్తే చేతిలో గరిట పట్టుకుని అన్నపూర్ణాదేవిగా మారి తన బిడ్డ ఆకలి తీరుస్తుంది.అదేవిధంగా తన బిడ్డ అల్లరి చేస్తే ఆదిపరాశక్తిగా మారుతుంది.
చదువుల విషయంలో తన బిడ్డకు చేదోడువాదోడుగా ఉంటూ సరస్వతిగా, డబ్బులు అవసరమైతే లక్ష్మీదేవిగా మారుతుంది.ఈ విధంగా మన కళ్ళ ఎదురుగా ఉన్న తల్లి అనేక రూపాలలో కనిపిస్తుంటే ఈ సృష్టిని సృష్టించిన ఆ భగవంతుడు తన బిడ్డల కోసం ఎన్ని రూపాలలోనైనా దర్శనమిస్తాడు కదా.

మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లోకధర్మం కోసం ధర్మాన్ని నిలబెట్టి, శత్రుసంహారం చేయడం కోసం ఒక్కో యుగంలో ఒక్కో అవతారం అంటే కృష్ణుడు గాను, నారాయణుడు గాను, శ్రీ హరి గాను, నరసింహ స్వామి గాను వివిధ రూపాలలో అవతారమెత్తారు కనుక హిందువులు ఒకే దేవుడిని వివిధ రూపాలలో పూజించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ విధంగా దేవుడు సృష్టించిన ఈ బిడ్డలను రక్షించడం కోసం భగవంతుడు అనేక రూపాలలో ఉండటం వల్లే హిందూమతంలో ఇంతమంది దేవతలు ఉన్నారు.ప్రకృతిలో ప్రతి దానిని పూజించే హిందువులకు ఎందుకు అంత మంది దేవతలు ఉన్నారని అడిగితే అది అర్థం లేని ప్రశ్నగానే మిగులుతుంది అని చెప్పవచ్చు.