చంద్రబాబుని కలిసిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు..!!

నేడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( TDP President Kasani Gnaneshwar ).రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యారు.

 Telangana Tdp President Kasani Gnaneshwar Key Comments After Meeting Chandrababu-TeluguStop.com

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు( Chandrababu ) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.చంద్రబాబు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని చెప్పుకొచ్చారు.జైల్లో ఆయన పరిస్థితి చూడగానే చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.45 ఏళ్ల రాజకీయ జీవితంలో నిత్యం ప్రజల కోసం పనిచేసిన చంద్రబాబుని ఆ రకంగా చూడటం చాలా బాధ కలిగించింది అని అన్నారు.ఇదే సమయంలో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

కచ్చితంగా చంద్రబాబు త్వరలోనే జైలు నుండి బయటకు వస్తారని స్పష్టం చేశారు.

నేడు మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు లోకేష్, భువనేశ్వరితో పాటు కాసాని జ్ఞానేశ్వర్.ములాఖత్ అయ్యారు.ఇదే సమయంలో త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల విషయంలో అభ్యర్థుల ఎంపిక.ఇంకా ఇతర ఇతర విషయాల గురించి కూడా చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగానే తెలంగాణాలో కూడా జనసేన -తెలుగుదేశం కలిసి ఎన్నికలకు వెళ్తాయని తెలంగాణాలో కూడా పొత్తు ఖాయం అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube