మొటిమలుప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తీవ్రంగా మదన పెట్టే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.అయితే మొటిమలు ముఖంపైనే కాదు.
కొందరికి వీపుపై కూడా వస్తుంటాయి.చెమట, జిడ్డు, మృత కణాలు పేరుకుపోవడం వంటి రకరకాల కారణాల వల్ల వీపుపై మొటిమలు ఏర్పడతాయి.
ఇవి తీవ్రమైన నొప్పిని కూడా కలగజేస్తాయి.దాంతో వాటిని నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకుంటే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను తీసుకుంటే వీపుపై మొటిమలు సులభంగా నివారించుకోవచ్చు.
మరియు మళ్లీ మళ్లీ రాకుండా కూడా అడ్డుకట్ట వేయవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
వీపుపై మొటిమలను తగ్గించడంలో టీట్రీ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్, రెండు చుక్కలు టీట్రీ ఆయిల్ వేసుకుని బాగా కలపాలి.
ఈ ఆయిల్‌ను వీపుకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజూ నైట్ నిద్రించే ముందు ఇలా చేస్తే మొటిమలు క్రమంగా దూరం అవుతాయి.అలాగే బయట తిరిగి ఇంటికి వచ్చాక మరియు వ్యాయామాలను పూర్తి చేసుకున్నాక తప్పని సరిగా స్నానం చేయాలి.లేదంటే చెమట, దాని కారణంగా పేరుకుపోయే దుమ్ము ధూళి మొటిమలకు కారణం అవుతాయి.
అందుకే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
వీపుపై ఉండే మృత కణాలను ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి.అందుకోసం వారానికి ఒకసారైనా షుగర్ స్క్రబ్, కాఫీ స్క్రబ్ వంటి వాటిని వీపుపై ఉపయోగించాలి.తద్వారా మొటిమలు రాకుండా ఉంటాయి.
ఒకవేళ ఉన్నా తగ్గుముఖం పడతాయి.ఇక కొందరు బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాత్రమే సన్‌స్క్రీన్ ను రాస్తారు.కానీ, వీపుకీ సన్‌స్క్రీన్ అవసరమే.ఎందుకంటే చెమట, దుమ్ము కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు ఇది సహాయపడుతుంది.మొటిమలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.