సంక్రాంతికి శ్రీశైలం వెళుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

చాలామంది పండుగ సెలవుల్లో పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకుంటారు.ముఖ్యంగా మకర సంక్రాంతి( Makara Sankranti ) వేల ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్నను( Srisailam Mallanna ) సందర్శించే వారు చాలామంది ఎక్కువగా పెరిగిపోయారు.

 Makara Sankranti Brahmotsavam In Srisailam From 12th To 18th January Details, Ma-TeluguStop.com

ఇక ఈ జనవరి నెలలో ఈ శ్రీశైలం యాత్రకు వెళ్లే వారి కోసం ఆలయం మరింత అందంగా ముస్తాబవుతుంది.ఇక శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఇక 12వ తేదీన యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఐతే ఉదయం 8 : 30 నిమిషాలకు యాగశాల ప్రవేశం చేసి ఈవో, ఉభయ, దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు ఉత్సవాలకు శ్రీకారం చేపడతారు.

Telugu Bhakti, Devotional, Makarasankranti, Srisailam, Srisailammakara-Latest Ne

అయితే సాయంత్రం ఐదు గంటలకు అగ్ని ప్రతిష్టాపన చేస్తారు.ఇక సాయంత్రం ఏడు గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ( Dhvajarohana ) కార్యక్రమం కూడా ప్రారంభిస్తారు.ఇక పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam ) ఘనంగా జరగనున్నాయి.ఇక ఈ నెలలో 18వ తేదీన ఈ ఉత్సవాలు ముగిస్తాయి.ఇక సంక్రాంతి వేళ ఈ ఉత్సవాల కారణంగా ఆర్జిత హోమాలు, స్వామి అమ్మవార్ల లీలా కల్యాణోత్సవం నిలిపివేయడం జరిగింది.13వ తేదీన భృంగివాహన సేవ, 14న రావణవాహన సేవ, 15వ తేదీ నందివాహన సేవ, స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం.

Telugu Bhakti, Devotional, Makarasankranti, Srisailam, Srisailammakara-Latest Ne

అలాగే 16వ తేదీన కైలాసవాహన సేవ,( Kailasavahana Seva ) 17 వ తేదీన యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోణ కార్యక్రమాలు, 18వ తేదీన పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ ఇవన్నీ కూడా జరగనున్నాయి.దీంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి.అయితే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ భక్తుల రద్దీ కారణంగా నేటి నుండి 18 వ తేదీ వరకు కొన్ని సేవలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.కాబట్టి శ్రీశైలం వచ్చే భక్తులంతా దీన్ని గమనించాలని తెలిపారు.

ఇక ఆర్థికంగా వెనుకబడిన సామాన్య భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం భక్తులకు ఒకరోజు ఉచిత సామూహిక సేవలు జరుపుకునే అవకాశం కల్పించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube