మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నాటి ప్రాచీన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.తాజాగా మరో ప్రాచీన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది.
పుంగనూరు మండలం నెక్కుంది సమీపంలో అగస్త్యేశ్వరస్వామి కొండ పై రెండు ముక్కలైన దశలో ఉన్న ఈ రాతి మీద అక్షరాలు క్రీస్తు శకం 1674వ సంవత్సరానికి చెందిన చరిత్రక ఆధారమని వెల్లడించింది.అగస్త్యేశ్వరాలయం కొండ శిఖరాగ్రాన ప్రదేశంలో అగస్త్య మహారుషి పూజించిన శివలింగాన్ని ప్రతిష్టించడంతో ఈ దేవాలయానికి పేరు వచ్చింది అని చెబుతారు.
ప్రతి సంవత్సరం ఇక్కడ మహా శివ రాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి.దేవాలయం వద్ద 16 స్తంభాల పై నాలుగు అంతస్తుల గౌనోళ్ల మండలం 18 మెట్లపై అత్యంత సుందరంగా నిర్మించారు.
ఈ మండపానికి సంబంధించిన ఆధారం సమీపంలోని లభించింది.రాతి బండ పై తెలుగులో 11 వరుసలతో వివరాలు ఉన్నాయి.1674వ సంవత్సరంలో బయిరాకూరుకు చెందిన అమ్మాజమ్మ మనువడు లింగనగవుని-హలిదేవమ్మ దంపతుల కుమారుడు అయిన ములువగలు గవుడు తమ పెద్దల శివప్రీతి కోసం శివాలయంలో ఈ మండపాన్ని కట్టించినట్లుగా శాసనంలో ఉంది.
పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా పనిచేసే ఎన్.ఆంజనేయ రెడ్డి, శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ లెక్చరర్ కే.సావిత్రి ప్రార్థన పురాతన శిలాశాసన లను అన్వేషిస్తూ ఉండేవారు.ఇందులో భాగంగానే వీరు ఈ ప్రాచీన శిలా శాసనాన్ని గుర్తించారు.ఈ ఫోటోలను మైసూర్ లోని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపారు.ఆయన అధ్యయనం చేసి దాని కాలాన్ని అందులోని వివరాలను ప్రజలకు వెల్లడించారు.
DEVOTIONAL