ఏ పాత్రాలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ ఒక ప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయారు.అందుకు కారణం తన మొదటి భార్య నిర్లక్ష్యమే అని ప్రకాష్ రాజ్ బలంగా నమ్ముతారు.
తన ఒకగానొక్క కుమారుడు చనిపోవడానికి తన భార్యే కారణమని ఆమెపై కోపం పెంచుకొని ఏకంగా విడాకులు ఇచ్చిన ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు.ఇంతకీ ప్రకాష్ రాజ్ మొదటి భార్య ఎవరు? ఆమె చేసిన తప్పేంటి? ప్రకాష్ రాజ్ రెండవ భార్య ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం పదండి.< ప్రకాష్ రాజ్ లలిత కుమారి అనే యువతిని 1994లో పెళ్లి చేసుకున్నారు.దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతి కి లలిత కుమారి స్వయానా చెల్లి.
అయితే ప్రకాష్ రాజ్, లలితకుమారి దంపతులకు మేఘనా, పూజ అనే ఇద్దరు కూతుర్లతో పాటు సిద్ధూ అనే ఒక కుమారుడు జన్మించాడు.ప్రకాష్ రాజ్ కి తన కూతుర్లు, కొడుకు అంటే అమితమైన ప్రేమ.
ఆయన తన భార్యా పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి షూటింగ్లను త్వరగా పూర్తి చేసి ఇంటికి వచ్చేవారు.అయితే ఎంతో ఆనందంతో తన వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ప్రకాష్ రాజ్ జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది.
ఆ దుర్ఘటన తో ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది.
ఆ విషాదమైన సంఘటన ఏమిటంటే.2004వ సంవత్సరంలో ప్రకాష్ రాజ్ భార్య లలిత కుమారి తన ముద్దుల కొడుకు అయిన సిద్ధూ ని తన ఇద్దరు కూతుళ్లకు అప్పగించి ఏదో పని మీద బయటికి వెళ్లారు.ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళు గాలిపటాలు ఎగురవేస్తున్నారట.
దీనితో వారితో పాటు సిద్ధూ కూడా గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించాడు.అప్పటికి సిద్దు వయస్సు కేవలం నాలుగు సంవత్సరాలే.
ఐతే టెర్రస్ పైన గాలిపటం ఎగరవేస్తున్న సమయంలో సిద్ధూ ఆకాశం వైపు మాత్రమే చూస్తూ ముందుకు నడుచుకుంటూ పోయి పైనుంచి కింద పడిపోయాడు.ఆ సమయంలో సిద్దు అక్కలు తమ స్నేహితులతో ఆడుకుంటున్నారట.
ఐతే గాలిపటాల ఆట ఆడుకుంటున్న కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి సిద్దు అక్కలతో ఈ విషయాన్ని చెప్పారు.దీనితో వాళ్ళిద్దరూ హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి పక్కనింటి తన తమ్ముడు టెర్రస్ పై నుంచి పడి పోయాడని ఏడ్చుకుంటూ చెప్పారు.
ఈలోగా లలిత కుమారి తన కొడుకు కిందపడిపోయాడు అని తెలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి సిద్ధూ ని ఆస్పత్రికి తరలించారు.అయితే షూటింగ్ మధ్యలో ఉన్న ప్రకాష్ కి ఈ విషయం తెలిసి వెంటనే ఆస్పత్రికి గబగబా వచ్చేశారట.
తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన తన కుమారుడిని చూసి ప్రకాష్ రాజ్ బాగా కుమిలిపోయారు.హాస్పటల్ లో చేరిన కొద్ది రోజులకే సిద్దూకి తీవ్రమైన కాంప్లికేషన్స్ వచ్చాయి.
దీంతో ఆ పిల్లోడి పరిస్థితి మరింత విషమించింది.పైనుంచి కింద పడినప్పుడు తగిలిన గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో సిద్ధూ నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తన తుది శ్వాస విడిచాడు.
కొడుకు చనిపోయాడన్న నిజాన్ని ప్రకాష్ రాజ్ జీర్ణించుకోలేకపోయారు.తన కుమారుడి అకాల మరణం తలుచుకుంటూ చాలా రోజుల వరకు ప్రకాష్ రాజ్ ఏడ్చారు.
తన కొడుకు చనిపోవడానికి తన భార్య నిర్లక్ష్యమే కారణమని ప్రకాష్ రాజ్ తనలోతానే అనుకుంటూ లలిత కుమారి పై బాగా కోపం పెంచుకున్నారు.ఈ దుర్ఘటన అనంతరం ఆయన తన భార్యతో సరిగా మాట్లాడిన సందర్భాలే లేవట.
ఆ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ కి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ తో పరిచయం ఏర్పడింది.వీళ్లిద్దరు చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు.మహేష్ బాబు నటించిన పోకిరి సల్మాన్ ఖాన్ నటించిన వాంటెడ్ సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు.ఆ టైమ్ లోనే ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు.ఎంతగా అంటే ఆమెను పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలని ప్రకాష్ రాజ్ అనుకున్నారు.అందుకే తన మొదటి భార్య లలిత కుమారి కి 2009వ సంవత్సరంలో విడాకులు ఇచ్చేస పోనీ వర్మ ను 2010వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.
ప్రకాష్ రాజు, పోనీ వర్మ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు.ఆ కుమారుడికి వేదాంత్ అనే పేరు పెట్టారు.అయితే ప్రకాష్ రాజు తన 45 వయస్సు లో రెండో పెళ్లి చేసుకోగా.50 ఏళ్ల వయసులో తన రెండవ కుమారుడికి తండ్రయ్యారు.