సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆడపిల్లలు రంగవళ్లులు కోసం మగ పిల్లలు పతంగుల కోసం తెగ ఆరాట పడిపోతుంటారు.చిన్న పిల్లలైతే పండుగ ముందు రోజు నుంచే పెద్దలను పతంగులు కొనివ్వమని అడుగుతారు.

 Why Is A Kite Flown On Sankranthi Day, Devotional, Kites ,  Sankranthi , Telugu-TeluguStop.com

మరి కొందరైతే పండగకు ఇంకా పది రోజుల సమయం ఉందన్నప్పటి నుంచి పతంగులు ఎగుర వేస్తుంటారు.చిన్నప్పుడు, ఇప్పుడు మనం కూడా పతంగులు ఎగుర వేస్తున్నాం.

కానీ సంక్రాంతి పండుగ అప్పుడే పతంగులు ఎందుకు ఎగర వేయాలి అనే విషయం మాత్రం మనకు తెలియదు.అసలు సంక్రాంతి పండుగ అప్పుడే పతంగులు ఎందుకు ఎగుర వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగ సమయంలో.సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన కొంత సమయం తర్వాత వచ్చే సూర్య కిరణాలు మానవ శరీరానికి ఎంతో మంచి చేస్తాయి.

వాటి వల్ల మన శరీరంలో ఉన్న ఎన్నో రోగాలు తొలగి పోతాయని పురాణాలు చెబుతున్నాయి.ఆ సమయంలో ప్రజలందరికీ ఈ సూర్య కిరణాలు తగలాలనే ఉద్దేశంతో… ఇళ్లలోంచి బయటకు, మిద్దెలపైకి చేరి పతంలుగుల వదలాలని మన పెద్దలు… సంక్రాంతి పండుగ పూట పతంగులు వదలడం ఆచారంలోకి తీసుకొచ్చారు.

ఈ విషయం మనకు తెలియక పోయినప్పటికీ… ఆ పతంగులు ఎగుర వేయడంలో ఉన్న ఆనందంతో మనం అలా చేస్తుంటాం.మన పూర్వీకులు చేసే ప్రతీ పండుగ, పని వెనక ఏదో ఒక శాస్త్రీయ దృక్పథం ఖచ్చితంగా ఉంటుంది.

అందుకే అవన్ని పాటిస్తే మనతో పాటు మన రాబోయే తరాలు కూడా చాలా బాగుంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube