Sequel Movies : సీక్వెల్ గా వస్తున్న సినిమాలకు మారిపోతున్న హీరోలు..ఆ మ్యాజిక్ కుదిరేనా ?

సాధారణంగా ఏ చిత్రమైన విజయం సాధిస్తే దానికి పార్ట్ 2 కూడా ఉండడం ఈ మధ్యకాలంలో బాగా అలవాటైపోయింది.అలా ఆ సీక్వెల్స్ తీయాలి అనుకోవడం వరకు బాగానే ఉన్నా అందులో నటించే హీరోలే మారిపోతూ ఉండడం విశేషం.

 Heros Are Replacing In Sequel Movies-TeluguStop.com

ఎన్ని సినిమాలు ఎన్ని భాగాలుగా తీశారు అనేది విషయం కాదు హీరోలను రిపీట్ చేయడం కూడా అవసరం.అందుకే ఈ మధ్యకాలంలో రాబోతున్న క్రేజీ చిత్రాల్లో సీక్వెల్ చిత్రాల్లో హీరోలు మారిపోతూ వస్తున్నాయి.

మరి ఆ సీక్వెల్ సినిమాలు ఏమిటి? మారిన ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

డాన్

అమితాబ్ నటించిన డాన్ సినిమాకు రీమేక్ వెర్షన్ గా వచ్చింది షారుక్ ఖాన్ హీరోగా నటించిన డాన్.

అయితే ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించాయి.దాంతో ఫర్హాన్ మూడో పార్ట్ తీసే పనిలో ఉన్నాడు, మొదటి 2 భాగాలకు ఫర్హాన్ దర్శకత్వం వహించగా, మూడో భాగం కోసం స్క్రిప్ట్ వరకు జరుగుతున్న నేపథ్యంలో షారుక్ తో కాకుండా రణ్వీర్ సింగ్( Ranveer Singh ) తో ఈ సినిమాను తీయబోతున్నారు.

దానికి గల కారణం మూడవ పార్ట్ విషయంలో సంతృప్తికరంగా లేకపోవడం.

జిగర్తాండా

Telugu Chandramukhi, Gentle, Heroes, Heros Sequel, Jigarthanda, Raksasudu, Seque

తమిళ్లో బాబీసింహ, సిద్ధార్థ్ నటించిన జిగర్తాండా సినిమా కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraju ) దర్శకత్వంలో వచ్చి ఘనవిజయం సాధించుకుంది.దాదాపు ఈ చిత్రం వచ్చి 9 ఏళ్ళు దాటిన ఇప్పుడు పార్ట్ 2 నిర్మాణం కాబోతోంది.కానీ ఈ సినిమాకు దర్శకుడు ఒక్కరే అయినప్పటికీ హీరోలు మాత్రం మారిపోయారు.

ఇప్పుడు సీక్వెల్లో రాఘవ లారెన్స్ నెగటివ్ షేడ్ ఉన్న హీరోగా నటిస్తుండగా, ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు.

చంద్రముఖి

Telugu Chandramukhi, Gentle, Heroes, Heros Sequel, Jigarthanda, Raksasudu, Seque

రజనీకాంత్ హీరోగా నటించిన తమిళ చిత్రం చంద్రముఖి ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీయబోతున్నారు అయితే రజనీకాంత్ ప్లేస్ లో రాఘవ లారెన్స్( Raghava Lawrence ) హీరోగా నటిస్తున్నాడు ఇక.చంద్రముఖి పాత్రలో నటించిన జ్యోతిక స్థానంలో కంగనా రనౌత్ నటిస్తుంది.

జెంటిల్ మేన్

Telugu Chandramukhi, Gentle, Heroes, Heros Sequel, Jigarthanda, Raksasudu, Seque

తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్మెన్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది.ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించగా అతిపెద్ద విజయం సాధించింది.ఇన్నాళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారు.ఈ సినిమాకు హీరో అర్జున్ కాకుండా మరొక స్టార్ ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.ఇక ప్రియా లాల్, నయనతార వంటి హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు.

రాక్షసుడు

Telugu Chandramukhi, Gentle, Heroes, Heros Sequel, Jigarthanda, Raksasudu, Seque

బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో తీసిన సినిమా రాక్షసుడు.ఈ చిత్రం రాక్షసన్ అనే పేరుతో తమిళ్లో మంచి విజయాన్ని సాధించగా తెలుగులో రాక్షసుడు సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు ఇప్పటికే కథ పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ హీరో మాత్రం మారే అవకాశం కనిపిస్తుంది.ఒక స్టార్ హీరో ఇందులో నటిస్తున్నాడని సమాచారం అందుతుంది.

హిట్

Telugu Chandramukhi, Gentle, Heroes, Heros Sequel, Jigarthanda, Raksasudu, Seque

హిట్ సినిమా మొట్టమొదటి పార్ట్ లో విశ్వక్సేన్ హీరోగా నటించగా రెండో పార్ట్ లో అడవి శేషు కనిపించాడు.ఇక మూడవ పార్ట్ లో నాచురల్ స్టార్ నాని ( Nani )కనిపిస్తున్నాడు.ఈ హిట్ సినిమా ఫ్రాంచేజి గా వస్తున్నప్పటికీ ఒక్కో పార్ట్ లో ఒక్కో హీరో నటిస్తూ వస్తున్నాడు.ఇక మూడవ పార్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తున్నాయి.

దీనికి మొత్తంగా ఏడు భాగాలు ఉంటాయని ఇప్పటికే డైరెక్ట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube