ఐస్‌క్రీమ్( Ice Cream ) చాలా కూల్, టేస్టీగా ఉండే ఒక ఫుడ్ ఐటమ్.ఇక బిర్యానీ( Biryani ) హాట్ హాట్ గా ఘుమఘుమలాడే మసాలా సుగంధం! ఈ రెండూ వేర్వేరు రుచుల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
కానీ, ఈ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుంది? ఇలాంటి వింత ఆలోచన మహిళకు వచ్చింది.అంతే “ఐస్‌క్రీమ్ బిర్యానీ”( Ice Cream Biryani ) అనే కొత్త ఐటమ్ పురుడు పోసుకుంది.
వినడానికి విడ్డూరంగా ఉంది కదా? ముంబైకి చెందిన ఫుడ్ క్రియేటర్ హీనా కౌసర్ రాద్( Heena Kausar Raad ) చేసిన ఈ ఎక్స్‌పెరిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ కాంబినేషన్ చూసిన నెటిజన్లు షాక్ అవ్వడంతో పాటు, వింత కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
హీనా ఒక బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు.తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు ముగిసిన సందర్భంగా ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు.అక్కడే ఈ వింత వంటకాన్ని పరిచయం చేశారు.ఆ పార్టీలో ఉన్నవాళ్లతో పాటు, ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు బిర్యానీలో ఐస్‌క్రీమ్ ఏంటి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ వీడియోలో హీనా రెండు పెద్ద బిర్యానీ కుండల పక్కన నిలబడి ఉన్నారు.పింక్ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ స్కూప్స్‌తో ఆ కుండలను అలంకరించారు.గరిటెతో బిర్యానీని తీస్తుంటే, బంగారు వర్ణంలో మెరిసే మసాలా బిర్యానీ, దానికి పూర్తి కాంట్రాస్ట్‌గా ఉండే పింక్ ఐస్‌క్రీమ్ ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఈ విజువల్ ఎఫెక్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
హీనా క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు.కానీ, ఈ ఫ్యూజన్ డిష్ మాత్రం చాలామంది ఫుడ్ లవర్స్‌కి మింగుడు పడటం లేదు.సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.“బిర్యానీని ఇలా అవమానించాలా?”, “అసలు ఇది తినేవాళ్లు ఉంటారా?” అంటూ రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.కొందరైతే, “ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారో అర్థం కాదు” అని విసుక్కుంటున్నారు.
విమర్శలు వస్తున్నా ఐస్‌క్రీమ్ బిర్యానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక సెన్సేషన్‌గా మారింది.ఇప్పటివరకు చూసిన వింత ఫుడ్ ట్రెండ్స్‌లో ఇదొకటిగా నిలిచిపోయింది.దీన్ని ఇష్టపడేవాళ్లు ఉన్నా లేకపోయినా, ఈ వింత క్రియేషన్ మాత్రం వంటకాల ప్రయోగాలు కొన్నిసార్లు ఎంత విడ్డూరంగా ఉంటాయో గుర్తు చేస్తోంది.