ఒకప్పుడు తెలంగాణ భాష అంటేనే చిన్న చూపు ఉండేది.ఇక్కడి యాస, భాషను సినిమా పరిశ్రమలో కేవలం కమెడియన్లకు వాడేవారు.
లేదంటే రౌడీలకు వాడేవారు.కానీ ప్రస్తుతం సినిమా పరిశ్రమలో మార్పు కనిపిస్తుంది.
తెలంగాణ యాస ఉంటేనే జనాలు చూసే పరిస్థితి వచ్చింది.తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ యాసతో బతికే పరిస్థితి నెలకొంది.
తాజాగా విడుదల అవుతున్న చాలా సినిమాలు ఇదే పద్దతిలో ముందుకు సాగుతున్నాయి.ఇదే విషయం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.
ఒకప్పుడు జోకర్లతో తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష మాట్లాడిస్తూ ఎద్దేవా చేసేవారున్నారు.ప్రస్తుతం తెలంగాణ యాస, భాషను హీరోలు మాట్లాడుతూ హిట్ కొడుతున్నారని చెప్పారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత గౌరవం వచ్చిందో చెప్పాలంటే ఈ ఉదాహరణ చాలు అన్నారు.తెలుగు సినిమాల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి సంస్కృతికి, సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇస్తున్నట్లు చెప్పారు.
వాస్తవానికి హైదరాబాద్ కేంద్రంగానే టాలీవుడ్ పని చేస్తుంది.ఎంతో మంది హీరోలు, సినిమా కళాకారులకు టాలీవుడ్ ఉపాధి కల్పిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం సైతం తెలుగు సినిమా పరిశ్రమకు మంచి ప్రాధాన్యత ఇస్తుంది.దశాబ్దాలుగా ఆంధ్రా, రాయలసీమ యాసల్లోనే కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చాయి.కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది.తెలంగాణ వచ్చాక.ఇక్కడి యాసతో సినిమాలు చేయడం మొదలయ్యాయి.టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
అటు ప్రతి సినిమాలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ తప్పకుండా ఉండేలా సినీ దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆయా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లను తెలంగాణ యాసతో మాట్లాడిస్తే జనాలు సైతం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు ఫిదా సినిమా నుంచి మొదలుకొని లవ్ స్టోరీ వరకు మొత్తం తెలంగాణ యాసలోనే సినిమాలు తీశాడు.జనాల నుంచి మంచి ఆదరణ దక్కింది.
తాజాగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో రానా క్యారెక్టర్ ను కూడా తెలంగాణ వ్యక్తిగానే చూపించారు.ఇక త్వరలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ తెలంగాణ బ్యాగ్రాప్ తో సినిమా నడుస్తోంది.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ యాసలోనే మాట్లాడబోతున్నాడు.మొత్తంగా తెలుగు సినిమా అంతా ఇప్పుడు తెలంగాణ యాసతో గుబాలిస్తుంది.