హెయిర్ ఫాల్.దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న కామన్ సమస్య ఇది.అయితే హెయిర్ ఫాల్ అనేది అందరిలోనూ ఒకేలా ఉండదు.కొందరికి లైట్‌గా ఉంటే.మరికొందరికి బాగా తీవ్రంగా ఉంటుంది.అయితే ఎంత తీవ్రమైన హెయిర్ ఫాల్‌కి అయినా అడ్డుకట్ట వేసే సూపర్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.ఈ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీడియం సైజ్ అల్లం ముక్కను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ నుండి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల మందారం పువ్వుల పొడి వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
![Telugu Care, Care Tips, Fall, Fall Remedy, Pack, Heavy Fall, Long, Remedy, Thick Telugu Care, Care Tips, Fall, Fall Remedy, Pack, Heavy Fall, Long, Remedy, Thick](https://telugustop.com/wp-content/uploads/2022/07/hair-care-tips-long-hair.jpg)
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్‌ను ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టి.
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.అంతేకాదు, పైన చెప్పిన హెయిర్ ప్యాక్‌ను పాటించడం వల్ల చుండ్రు సమస్య నుండి విముక్తి లభిస్తుంది.
జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా కూడా ఉంటుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.తప్పకుండా ఈ సింపుల్ అండ్ న్యాచురల్ హెయిర్ ప్యాక్‌ను ట్రై చేయండి.
మంచి ఫలితాలు మీసొంతం అవుతాయి.